Moviesపెళ్ల‌య్యి బిడ్డ పుట్టాక కూడా కాజ‌ల్ నాభి అందాల ఆర‌బోతేనా...!

పెళ్ల‌య్యి బిడ్డ పుట్టాక కూడా కాజ‌ల్ నాభి అందాల ఆర‌బోతేనా…!

చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు నాభి అందాల ప్రదర్శన ఇస్తుందా..? అని ప్రస్తుతం నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం తను మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుండటమే. నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత చందమామ, మగధీర లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. దాదపు 15 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ ఓ వెలుగు వెలిగింది.

తెలుగు, తమిళ భాషల్లో కాజల్ కి ఉన్న క్రేజ్ అసాధారణం. ఇలాంటి హీరోయిన్ సినిమాలకు దూరంగా ఉంటే ఫ్యాన్స్ కి కష్టమే. అందం ఉంటే ఎంతకాలం అయినా ఇండస్ట్రీలో కొనసాగవచ్చు. దానికి ఉదాహరణ కాజల్ అగర్వాల్. అయితే, పెళ్లి..ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఇక సినిమాలకి ఫుల్ స్టాప్ పెడుతుందనుకున్నారు. కానీ, త్వరగానే కాజల్ మళ్ళీ మొహానికి రంగేసుకుంటుంది. కమల్ హాసన్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇండియన్ 2లో కాజల్ ప్రధాన కథానాయిక.

ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక మళ్ళీ ఈ మూవీ మొదలవడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ, వచ్చే సెప్టెమర్ నుంచి ఇండియన్ 2 సెట్స్ మీదకు వస్తోంది. బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసేందుకు కొత్త షెడ్యూల్ మొదలు పెడుతున్నారు. ఈ షెడ్యూల్‌లో కాజల్ కూడా జాయిన్ కాబోతోంది. స్వయంగా తనే ఈ విషయాన్ని రివీల్ చేసింది. అయితే, కాజల్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. గ్లామర్ రోల్స్, అందాల ఆరబోతకి ఎప్పుడూ అడ్డు చెప్పింది లేదు.

ఎద అందాలను, నాభి అందాల ప్రదర్శనను బాగానే ఇచ్చింది. అయితే, బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత మునపటిలా కాజల్ గ్లామర్ రోల్స్ చేస్తుందా అంటే..ఇప్పుడే ఈ విషయం చెప్పడం కష్టమే. అందాల ప్రదర్శన, నాభి అందాలతో ఆకట్టుకునే పాత్రలు ఒప్పుకుంటుందా..? అనేది ఇప్పుడు చర్చ. అయితే, కాజల్ చాలా ప్రొఫషనల్. పాత్ర కోసం ఎలా అయినా స్క్రీన్ పైన కనిపించడానికి నో చెప్పదు. మరి ఇప్పుడు ఓ బిడ్దకి తల్లైంది కాబట్టి ఏవైనా కట్టుబాట్లు పెట్టుకుంటుందేమో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news