సినిమా వాళ్ల జీవితాలు నిజ జీవితంలో బయటకు కనిపించేంత రంగల మయంగా ఉండవు. వాళ్ల జీవితాల్లోనూ కష్టాలు కన్నీళ్లు ఉంటాయి. బోల్డ్ నటి గాయత్రి గుప్తా జీవితంలోనూ ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఫిదా సినిమాలో హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించి గాయత్రి గుప్త ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరవాత కొబ్బరిమట్ట, ఐస్‌క్రీం సినిమాలతో పాటూ మరికొన్ని చిత్రాలలో నటించింది. సినిమాల కంటే గాయత్రిగుప్త క్యాస్టింగ్ కౌచ్ వివాదంతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది.
అంతే కాకుండా బిగ్ బాస్ లోకి తనను పిలిచారని కానీ కమిట్మెంట్ అడిగారని బాంబు పేల్చింది. ఈ ఘటనలో గాయత్రి గుప్తా పోలీస్ స్టేషన్ మెట్లు సైతం ఎక్కింది. మరోవైపు కాస్టింగ్ కౌచ్ పై మొదట పోరాడిన గాయత్రి గుప్త ఆ తరవాత సైలెంట్ అవ్వడంతో శ్రీరెడ్డితో సైతం గొడవలకు దారి తీసింది. దాంతో వీరిద్దరూ టీవీ ఇంటర్వ్యూలలో ఒకరిని మరొకరు తిట్టుకున్నారు. ఇదిలా ఉండగా గాయత్రి గుప్త ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడినట్టు ఓ ఇంటర్యూలో తెలిపింది.
గాయత్రి గుప్తకు ఆమె కుటుంబ సభ్యులు చిన్నవయసులోనే వివాహం చేశారట. కానీ ఆ వివాహం ఇష్టం లేకపోవడంతో భర్తతో విడాకులు తీసుకుని ఒంటిరి జీవితాన్ని గడిపిందట. ఆ తరవాత ఫ్యామిలీకి దూరమై చేతిలో డబ్బులు లేక నరకం అనుభవించిందట. అంతే కాకుండా విడాకుల తరవాత ఓ వ్యక్తికి దగ్గరై అతడి చేతిలో మోసపోయానని గాయత్రి గుప్త ఆవేదన వ్యక్తం చేసింది. విడాకుల తరవాత ఓ వ్యక్తిని ఘాడంగా ప్రేమించానని అతడు కూడా తనను ప్రేమించాడని తెలిపింది.
అయితే అవసరం ఉనన్ని రోజులు తనను వాడుకున్న అతడు ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చాడని వాపోయింది. తనకు రెండో పెళ్లి అని తెలియడంతో అతడి ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదని దూరం పెట్టాడని తెలిపింది. ఆ తరవాత డిప్రెషన్ లోకి వెళ్లి చేయి కూడా కట్ చేసుకున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయినప్పటికీ అతడితో జీవితాన్ని పంచుకోలేకపోయానని బ్రేకప్ జరిగి ఏడేళ్లు అయ్యిందని తెలిపింది. ఇప్పటికీ అతడు గుర్తుకు వస్తాడంటూ తన జీవితంలోని చేదు అనుభవాన్ని పంచుకుంది.