శ్రీదేవి, జయప్రదల తర్వాత నాచురల్ అందంతో తెలుగు తెరను తాకిన మరొక హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నటి రజిని మాత్రమే. మజ్ను, అహ నా పెళ్ళంట వంటి సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్రను వేసుకుంది రజిని. తెలుగులో నాగార్జున సరసన నటించిన మజ్ను సినిమాకి మంచి గుర్తింపు లభించింది అలాగే కన్నడ సినీ పరిశ్రమలో విష్ణుతో మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో నటించి అన్ని భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.
రాజేంద్రప్రసాద్ తో అనేక సినిమాల్లో కలిసి నటించిన రజిని 1985లో బ్రహ్మముడి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఏకంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 150 కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. రాజేంద్రప్రసాద్ – రజనీ కాంబినేషన్ అంటే అప్పట్లో నవ్వులు పూయించే కాంబినేషన్‌గా మంచి పేరు ఉండేది. ఇక రజినీ చివరిగా 1983లో సినిమాలకు స్వస్తి చెప్పింది. రజిని అసలు పేరు శశికళ అలాగే పూర్తి పేరు రజిని పర్వర్.
బెంగుళూరులో పుట్టిన రజిని 1998లో వివాహం చేసుకొని సినిమా పరిశ్రమ నుంచి దూరమైంది. ఈమెకు ముగ్గురు పిల్లలు జన్మించాక ఆ వివాహ బంధం నుంచి బయటకు వచ్చి ఉంటరిగా జీవిస్తోంది. వాళ్ల జీవితాలు పెటాకులు కావడం పెద్ద వింత ఏమీ లేదు కానీ రజనీ జీవితంలో మాత్రం అనేక కష్టాలు ఉన్నాయట. ముల్లగిరి ప్రవీణ్ అనే ఒక ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకున్న రజిని తాను సినిమాల్లో సంపాదించిన డబ్బును అంతా కూడా భర్త దగ్గరే పెట్టిందట. అలాగే ముంబైలో ఒక అపార్ట్మెంట్ కూడా కొనుగోలు చేసుకుంది.
అయితే పెళ్లయ్యాక ఆమె భర్త అలాగే అత్త డబ్బుల కోసం రజినిని ఇబ్బంది పెట్టారట. అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేశారట. అంతేకాదు ఆమె కొనుక్కున్న అపార్ట్మెంట్ సైతం తన భర్త అతడి తల్లిపై రిజిస్ట్రేషన్ చేయించడంతో చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి రజనీకి వచ్చిందట. అంతేకాదు తనపై తప్పుడు కేసులు పెట్టి వదిలించుకోవాలని చూస్తున్నారంటూ కూడా కోర్టులో పిటిషన్ వేసింది రజిని. ముగ్గురు పిల్లలతో ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుంది. ఇప్పటికీ తనకు రావాల్సిన డబ్బుల కోసం.. అలాగే తన కష్టపడి సంపాదించిన తన కష్టార్జితం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతోంది.