Moviesఅదే నిజమైతే..నయన్ కూడా మరో సావిత్రి గానే మిగిలిపోనుందా..?

అదే నిజమైతే..నయన్ కూడా మరో సావిత్రి గానే మిగిలిపోనుందా..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫాం సంపాదించుకున్న బ్యూటీ..ఈ నయనతార. పెద్ద కళ్లుతో చూడాగానే అట్రాక్ట్ చేసే అందంతో కుర్రాళ్ళ మనసు దోచిన ఈ బ్యూటీ..ఇప్పుడు సౌత్ లోనే క్రేజీ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది. బడా హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేలా చేయించుకుంటున్న నయన్..ఈ మధ్యనే తన ప్రియుడు కోలీవుడ్ దైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుంది. మహాబలిపురంలో ని ఓ రిసార్ట్ లో ఈ జంట ఒక్కటైయ్యారు.

దీంతో నయన్ మిసెస్ విగ్నేస్ శివన్ గా మారిపోయింది. అయితే, వీళ్లు ప్రేమలో ఉంటున్న టైంలో వచ్చిన వార్తలకంటే..వీళ్ళు పెళ్లి చేసుకున్నాక వస్తున్న డౌట్లే ఎక్కువ ఉన్నాయి. కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. నయన్ ఇన్నాళ్లు తాను కష్టపడి సంపాదించినదంతా కూడా..విగ్నేశ్ పేరు పైనే రాసేస్తుందట. భర్త మీద ఎంత ప్రేమ ఉందో చాటి చెప్పడానికే ఇలా చేస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, దీని పై సినీ విశ్లేషకులు మత్రం..నయన్ నిర్ణయాని తప్పుబడుతున్నారు. ఈ రోజుల్లొ వివాహ బంధాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఇలాంటి టైంలో ఆస్తి మొత్తం ఇలా భర్త పేరు పై రాయడం..మంచిది కాదు అనేది వాళ్ల అభిప్రాయం. అంతేకాదు..నయన తో పోలిస్తే విగ్నేశ్ శివన్ రేంజ్ పాపులారిటీ కొంచెం తక్కువ. ఎక్కడికి వెళ్ళిన నయన్ భర్త విగ్నేశ్ శివన్ అంటున్నారే కానీ..విగ్నేశ్ శివన్ భార్య నయన్ అని అనడం లేదు. ఇప్పుడంటే ఓకె పెళ్లి మోజులో ఉన్నారు..అదే కొన్నళ్ళ తరువాత ఇదే కంటిన్యూ అయితే..ఖచ్చితం ఈగో ప్రాబ్లమ్‌స్ వస్తాయి. అప్పుడు నయన్ బ్రత్య్కు మరో సావిత్రిలా మారుతుందంటున్నారు జనాలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news