Moviesబాహుబ‌లి ప్ర‌భాస్ క్రేజ్ ఎందుకు ప‌డిపోతోంది... ఎక్క‌డ త‌ప్పు చేస్తున్నాడు...!

బాహుబ‌లి ప్ర‌భాస్ క్రేజ్ ఎందుకు ప‌డిపోతోంది… ఎక్క‌డ త‌ప్పు చేస్తున్నాడు…!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌.. ప్ర‌భాస్ అంటే బాహుబ‌లికి ముందు ప్ర‌భాస్‌.. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ అన్న‌ట్టుగా విశ్లేషించుకోవాలి. వ‌రుస‌గా మిర్చి, బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 హిట్ల‌తో ప్ర‌భాస్ ఎక్క‌డికో వెళ్లిపోయాడు. అస‌లు బాహుబ‌లి సీరిస్ విజ‌యాలు ప్ర‌భాస్‌ను అస‌లు సిస‌లు పాన్ ఇండియా స్టార్‌ను చేసేశాయి. ప్ర‌భాస్ అంటే బాలీవుడ్ బాడా ఖాన్‌లు సైతం బెంబెలెత్తే ప‌రిస్థితి వ‌చ్చింది. అదంతా బాహుబ‌లి పుణ్య‌మే.

బాహుబ‌లి వ‌ర‌ల్డ్ వైడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డం వెన‌కాల రాజ‌మౌళి విజ‌న్‌, ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఉండొచ్చు.. వాటితో పాటు ప్ర‌భాస్ క‌టౌట్‌, ఆహార్యం, ఫిజిక్‌, బాలీవుడ్ బ‌డా హీరోల‌ను త‌ల‌ద‌న్నే హీరోగా ఉండ‌డం.. ఇవ‌న్నీ దేశ‌వ్యాప్తంగానే కాకుండా.. ఇత‌ర దేశాల్లో సైతం ప్ర‌భాస్‌కు చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగేందుకు కార‌ణ‌మ‌య్యాయి. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ మానియా దేశాన్ని మామూలుగా ఊపేయ‌లేదు.

ఎక్క‌డో అసోం, సిక్కింలో చిన్న చిన్న ప‌నులు చేసుకునే యువ‌త కూడా ప్ర‌భాస్‌కు వీరాభిమానులు అయిపోయారు. అందుకే సాహో సినిమా తెలుగులో వ‌ర్క‌వుట్ కాలేదు. ఇంకా చెప్పాలంటే ఇక్క‌డ ప్లాప్ అయ్యింది. అయినా నార్త్‌లో రు. 150 కోట్ల పై చిలుకు వ‌సూళ్లు సాధించ‌డం వెన‌క ఈ క్రేజే కార‌ణం. అయితే ఎల్ల‌కాలం బ‌ల‌మైన క‌థ‌లు వ‌దిలేసి.. ఇమేజ్‌ను న‌మ్ముకుంటే ఈ క్రేజ్ నిల‌బ‌డ‌దు. సాహో వ‌ర‌కు అది వ‌ర్క‌వుట్ అయ్యింది.

త‌ర్వాత రాధేశ్యామ్‌నే తీసుకుంటే నార్త్‌లో రు. 5 కోట్లు కూడా రాలేదు. ప్ర‌భాస్ ఇమేజ్‌కు త‌గ్గ కథ ఇది కానే కాదు. ఈ సినిమాకు ఏకంగా రు. 120 కోట్ల‌కు పైగా న‌ష్టాలు వ‌చ్చాయి. ఇమేజ్‌ను వ‌దిలేసి.. రాంగ్ స్టెప్పులు వేస్తే క్రేజ్ ఎంత డౌన్ అయిపోతుందో ప్ర‌భాస్‌కు తెలిసివ‌చ్చింది. బాహుబ‌లి క‌థ వేరు.. దాని రేంజ్ వేరు. అలాగ‌నీ ప్ర‌తి సినిమాను అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా భారీ బ‌డ్జెట్ పెట్టేసి… పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తే రాధేశ్యామ్ ఫ‌లితాలే వ‌స్తాయి.

ఇక ఇప్పుడు ప్ర‌భాస్ కూడా వ‌రుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్‌, స‌లార్‌, వంగ సందీప్ స్పిరిట్‌, మారుతి సినిమా.. లైన్ చూడ‌డానికి బాగున్నా కొన్ని సినిమాల‌కు పాన్ ఇండియా లెవ‌ల్లో బిజినెస్ అనుకున్న రేంజ్‌లో జ‌ర‌గ‌డం లేదంటున్నారు. ఆదిపురుష్‌ను తెర‌కెక్కించేది హిందీ డైరెక్ట‌ర్ ఓం రౌత్‌. అయినా ఆ సినిమాకు అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేద‌ట‌. ప్రాజెక్ట్ కె, స‌లార్‌కు మాత్ర‌మే అడ్వాన్స్‌లు వ‌స్తోన్న ప‌రిస్థితి. ఇక తెలుగు వాడు అయిన మారుతి సినిమాకు అస‌లు తెలుగు వాళ్ల‌లోనే క్రేజ్ లేదు.

ఇక ఒక‌ప్పుడు ప్ర‌భాస్ ఎంత ప్లాప్ సినిమా చేసినా బుల్లితెర‌మీద భారీ టీఆర్పీలు వ‌చ్చేవి. తాజాగా రాధేశ్యామ్‌కు కేవ‌లం 8.25 రేటింగ్ వ‌చ్చింది. అది ఫ‌స్ట్ టైం… ప్ర‌భాస్ లాంటి హీరోకు ఇది చాలా త‌క్కువ రేటింగే అని చెప్పాలి. ఏదేమైనా ప్ర‌భాస్ పాన్ ఇండియా క‌థ‌లు.. అందులోనూ ప్ర‌జ‌ల‌కు క‌నీసం క‌నెక్ట్ అయ్యే లైన్లు ఎంచుకుని ముందుకు వెళితే త‌న క్రేజ్‌ను నిలుపుకోవ‌డంతో పాటు పాన్ ఇండియా లెవ‌ల్లో ఓ వెలుగు వెల‌గ‌వ‌చ్చు. ఎవ‌రో పెద్ద డైరెక్ట‌ర్‌.. పెద్ద బ్యాన‌ర్ అని ప్ర‌తి సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్లోనే ఊహించుకుంటే ఎదురు దెబ్బ‌లు త‌గిలితే ఎంత స్పీడ్‌గా పాన్ ఇండియా లెవ‌ల్‌కు వెళ్లాడో అంతే స్పీడ్‌గా డౌన్ అయిపోవ‌డం ఖాయం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news