Moviesఎన్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ ' ఆది ' సినిమా షూటింగ్‌లో వినాయ‌క్...

ఎన్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ ఆది ‘ సినిమా షూటింగ్‌లో వినాయ‌క్ ఎందుకు గొడ‌వ ప‌డ్డాడు… ఏం జ‌రిగింది…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ తరం హీరోలలో ఏ హీరోకి లేనివిధంగా ఏకంగా ఆరు వరస సూపర్ డూపర్ హీట్లు తో దూసుకుపోతున్నాడు. 2015లో వచ్చిన టెంపర్ సినిమాతో ప్రారంభమైన ఎన్టీఆర్ అప్రతిహత విజయప్రస్థానం నేటి త్రిబుల్ ఆర్ సినిమా వరకు కంటిన్యూగా దూసుకుపోతూ వస్తోంది. వరుసగా టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ – అరవింద సమేత వీరరాఘవ – త్రిబుల్ ఆర్ లాంటి సూపర్ డూపర్ హీట్లు ఎన్టీఆర్ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు ఉన్న సినీ పోటీ ప్రపంచంలో ఒక స్టార్ హీరో వరుసగా ఆరు సూపర్ డూపర్ హిట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు.

ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లోనే వరుసగా స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బ‌స్టర్ హిట్లు పడడంతో ఎన్టీఆర్ స్టార్ హీరో అయిపోయాడు. రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ అయినా కూడా ఎన్టీఆర్ చాలామంది సినీ అభిమానుల దృష్టిలో పడలేదు. ఎప్పుడు అయితే 2002 సమ్మర్ కానుకగా వచ్చిన ఆది ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిందో.. అప్పటినుంచి ఎన్టీఆర్ తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.

డైరెక్టర్ వివి .వినాయక్ కు ఆది మొదటి సినిమా. అప్పటివరకు సీనియర్ దర్శకుడు సాగర్ దగ్గర శిష్యరికం చేసిన వినాయక్ ఆదితో మెగా ఫోన్ పట్టి మొదటి సినిమాతోనే ఒక్కసారిగా ట్రెండ్ సెట్ చేశాడు. బెల్లంకొండ సురేష్ ఈ సినిమాకు నిర్మాత. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో దర్శకుడు వినాయక్ కు సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ కు మధ్య చిన్న క్లాషెస్ వచ్చాయట. ఇది వినాయక్‌ తొలి సినిమా. దీంతో అన్ని విభాగాలు ఫర్ఫెక్ట్ గా ఉండాలని సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ ని పెట్టుకున్నాడు.

ఒక షెడ్యూల్ షూటింగ్ అయిన వెంటనే తనకు మరో సినిమాలో ఛాన్స్ వచ్చిందని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు అట రాంప్రసాద్. ఇదే త‌న‌ తొలి సినిమా కావటంతో వినాయక్‌కు ఓ వైపు టెన్షన్ పెరిగిపోతుంది అంట. దీంతో సమీర్ రెడ్డిని తీసుకువచ్చి ఒక షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఆ తర్వాత సమీర్ రెడ్డికి మరో సినిమాలో ఛాన్స్ రావడంతో ఆయన కూడా ఆది సినిమాను మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రవీంద్రబాబును తీసుకువచ్చి మ‌రో షెడ్యూల్‌ పూర్తి చేయించాడ‌ట విన‌య్‌.

అప్పటికి తాను చేస్తున్న సినిమా పూర్తి కావడంతో రాంప్రసాద్ మళ్లీ వచ్చి ఆది సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యి సినిమా చివరి వరకు ఉన్నాడ‌ట‌. ఇలా తన సినిమా షూటింగ్‌ను మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం వినాయక్ కూ కాస్త అసహనం తెప్పించిందంట ఈ విషయాన్ని వినాయకే స్వయంగా చెప్పారు. అలా వినాయక్ తొలి సినిమాకే అనుకోకుండా ముగ్గురు ఫోటోగ్రాఫర్లును మార్చాల్సి వచ్చింది. చివరకు ఆది విజువల్స్ బ్రహ్మాండంగా వచ్చాయన్న ప్రశంసలు వచ్చాయి.

ఈ సినిమా ఆ రోజుల్లోనే 100 కేంద్రాలకు పైగా 50 రోజులు ఆడటంతో పాటు… 98 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది.. నిర్మాత బెల్లంకొండ ఇంటిని బంగార మయం చేసింది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో వినాయక్ ఐదారు సంవత్సరాల పాటు టాలీవుడ్ లో వెనక్కు తిరిగి చూసుకునే పని లేకుండా వరుస హిట్లతో దూసుకుపోయాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news