అర్జున్ రెడ్డి – గీతగోవిందం సినిమాలతో ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు నటుడు విజయ్ దేవరకొండ. ఈ రెండు సినిమాలతో విజయ్ దేవరకొండకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇంత తక్కువ టైంలో విజయ్ స్టార్ హీరోలకు పోటీగా దూసుకు వచ్చేశాడు. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా లైగర్‌తో పాటు మరో పాన్ ఇండియా సినిమా జనగణమనలో కూడా నటిస్తున్నాడు.
అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్‌గా ఖుషి సినిమాలోనూ నటిస్తున్నాడు. తాజాగా విజయ్ కాఫీ విత్ కరణ్ షోలో పలు సంచలన విషయాలు బయట పెట్టాడు. హీరోయిన్ రష్మికతో తన రిలేషన్ గురించి బయట జరుగుతున్న ప్రచారంపై స్పందించాడు. రష్మిక తన డార్లింగ్ అని.. ఆమె అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. అలాగే ప్రేమలో ఉన్నారా ? అన్న ప్రశ్నకు విజయ్ స్పందిస్తూ తాను పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తానని తెలిపాడు.
ఇక రష్మికతో రిలేషన్ లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ తన కెరీర్ ప్రారంభంలోనే ఆమెతో రెండు మంచి సినిమాలు చేశానని.. ఆమె తనకు ఎంతో సన్నిహితురాలు.. తామిద్దరం తమ జీవితంలోని కష్టసుఖాలపై ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామని.. అలా తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని విజయ్ చెప్పాడు. ఇక ఖుషి సినిమాలో తనతో పాటు కలిసిన నటిస్తున్న సమంత పై విజయ్ పొగడ్తల వర్షం కురిపించాడు.
ఆమె భారత దేశంలోనే అందమైన మహిళ అని.. అద్భుతమైన వ్యక్తి అని కొనియాడేశాడు. ఇక లైగర్ హీరోయిన్ అనన్య పాండే తో తాను డేటింగ్ కు వెళ్లానని… కాకపోతే అది ఫ్రెండ్లీ డేటింగ్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు. ఇక జాహ్నవి కపూర్‌ను తాను చాలా సార్లు బయట కలిశానని ఆమె చాలా క్యూట్ గా ఉంటుందని విజయ్ చెప్పాడు. ఇక చివరిగా మీరు శృంగారం ఎప్పుడు చేశారు ? పబ్లిక్ ప్రదేశాల్లో మీరు శృంగారంలో పాల్గొన్నారా ? అన్న ప్రశ్నలకు బదులిస్తూ.. తాను చివరగా ఓ సారి శృంగారంలో పాల్గొన్నానని మాత్రం విజయ్ చెప్పాడు.