కాస్టింగ్ కౌచ్ అనే పదం ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తోంది. సౌత్ నుంచి నార్త్ వరకు తేడా లేకుండా ఏ భాషలో చూసినా చాలా మంది కాస్టింగ్ కౌచ్ వలలో పడి విలవిల్లాడుతున్నామంటూ ఓపెన్‌గా చెపుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు, ఇటు తెలుగు హీరోయిన్లతో పాటు తమిళంలో సింగర్ చిన్మయి లాంటి వాళ్లు ఈ కాస్టింగ్ కౌచ్‌ను బాగా పాపులర్ చేశారు. వీరి దెబ్బతో చాలా మంది హీరోయిన్లు, నటీమణులు సైతం సినిమాల్లో అవకాశాల కోసం తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి ఓపెన్‌గానే చెపుతున్నారు.
అసలు కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా రంగంలోకి ముందు ఎలా ? వచ్చింది ? ఎక్కడ పుట్టింది ? అన్నది చూస్తే ఆసక్తికర సమాధానాలే కనిపిస్తాయి. ఈ కాస్టింగ్ కౌచ్ ముందుగా అమెరికాలోని యాడ్స్ రంగంలో పుట్టింది. అక్కడ అమ్మాయిలు మోడల్స్‌గా ఎదిగేందుకు కొందరు అవకాశాలను ఎరవేస్తారు ? నిన్ను టాప్ మోడల్‌ను చేస్తాను ? టాప్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద నీ ఫొటో వచ్చేలా చేస్తాను.. నిన్ను టాప్ బ్రాండ్లను ప్రమోట్ చేసేలా నేను చూసుకుంటాను అని వాళ్లకు ఆఫర్లు ఇస్తారు.
అప్పటి వరకు మామూలు అమ్మాయిగా ఉంటూ ఒక్కసారిగా పాపులర్ అయిపోవడం అంటే ఎవరికి అయినా ఆసక్తే ఉంటుంది. అందుకే వీళ్లు యాడ్స్‌ను డైరెక్ట్ చేసే డైరెక్టర్లకు లొంగిపోవడం జరిగింది. తమను టాప్ మోడల్‌ను చేసే క్రమంలో ఆ డైరెక్టర్లు వీళ్ల నుంచి సెక్సువల్ ఫేవర్ కోరుకోవడం.. అలా ఆ మోడల్స్ లొంగిపోవడం జరిగింది. ఇదే ఆ తర్వాత హాలీవుడ్ సినిమాల్లోకి వచ్చింది.
అక్కడ నుంచి ఇండియాకు దిగుమతి అయ్యింది. అయితే ఈ కల్చర్ 1970వ దశకంలో అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఉన్నా కూడా బాలీవుడ్‌లో ఎక్కువుగా ఉండేది. అప్పట్లో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, హీరోయిన్లు, నిర్మాతలు, హీరోయిన్ల మధ్య వారి అవకాశాలు, ఛాన్సులకు అనుగుణంగా ఈ ఎఫైర్లు, అక్రమ సంబంధాలు కొనసాగేవి. తర్వాత కాలక్రమంలో ఇదే కాస్టింగ్ కౌచ్ అయ్యింది.
ఇప్పుడు ఎవరైనా అమ్మాయికి ఛాన్స్ ఇవ్వాలంటే దర్శకులు, హీరోలు, నిర్మాతలు ఫేవర్ కోరుకుంటున్నారు. ఆ ఛాన్స్ కావాలనుకుని ఆ ఆ హీరోయిన్ రాజీపడితే వాళ్లకు పక్క పంచి సుఖం ఇవ్వక తప్పదు. అదే ఇష్టం లేకపోతే నో చెప్పేస్తున్నారు. ఇక కొందరు ముందు ఛాన్సుల కోసం సుఖాలు ఇచ్చి.. తర్వాత ఏదో ఒక టైం చూసుకుని నానా రచ్చ చేస్తున్నారు. ఇక ఈ కాస్టింగ్ కౌచ్ అనేదానిపై ఆడవాళ్లు ఇబ్బంది పడడం కాదు. కొందరు ఆడవాళ్లు, మహిళా నిర్మాతలు తాము మనసు పడిన మగవాళ్లను సైతం కోరుకుంటారట.
ముఖ్యంగా యంగ్ హీరోలు, కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్న హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు తప్పనిసరి పరిస్థితుల్లో
గిగాలిస్ ( మహిళలను సుఖపెట్టే కాల్‌బాయ్స్‌లాగా) అవతారం ఎత్తుతారట. వాళ్ల కెరీర్ కోసం, డబ్బుల కోసం మగవాళ్లు కూడా ఈ పని చేస్తూ ఉంటారు. వీళ్లను మేల్ ప్రాస్టిస్ట్యూట్స్, కాల్ బాయ్స్ అని కాకుండా ఇండస్ట్రీలో ఆడవాళ్లను సుఖపెట్టే వాళ్లను గిగాలిస్‌గా పిలుస్తూ ఉంటారు. ఇక మహిళలు కాస్టింగ్ కౌచ్ బాధితులు అయితే.. మగవాళ్లు గిగాలిస్ బాధితులు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది.