టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తొలి క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా లైగర్. అసలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ భాషలో చూసినా లైగర్ నామస్మరణే వినిపిస్తోంది. ఓ వైపు సౌత్… అందులోనూ తెలుగు నుంచి వస్తోన్న పాన్ ఇండియా సినిమాలు అన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. తెలుగు సినిమా పాన్ ఇండియా లెవల్లో వస్తోందంటే చాలు అంచనాలు మామూలుగా లేవు. బాలీవుడ్ వాళ్లు సైతం షేక్ అవుతున్నారు.
ఇప్పుడు లైగర్‌పై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి. సినిమా ఆగస్టు 25న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. ఇంకా నెల రోజుల టైం ఉంది. కానీ ఇప్పటి నుంచే అంచనాలు అయితే హోరెత్తుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ సాంగ్, టీజర్, మొన్నటి థియేట్రికల్ ట్రైలర్ ఇలా అన్ని సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. బాలీవుడ్లో విజయ్‌కు ఈ సినిమా రిలీజ్ కాకుండానే పిచ్చ క్రేజ్ వచ్చేసింది.
లైగర్ ట్రైలర్ రిలీజ్‌కు రణవీర్‌సింగ్ గెస్టుగా వచ్చాడు. ఈ కార్యక్రమంలో విజయ్ సింపుల్‌గా హవాయ్ చెప్పులతో వచ్చి మరీ అందరిని ఆశ్చర్యపరిచాడు. తన డిఫరెంట్ స్పీచ్‌తో బాలీవుడ్ జనాలను కూడా ఎట్రాక్ట్ చేశాడు. పైగా ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ భాగస్వామి కావడంతో అక్కడ కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అక్కడ బీ టౌన్ ఫ్యాన్స్ కూడా ట్రైలర్ ముగిసి విజయ్ బయటకు వెళుతున్నప్పుడు రౌడీ హీరో అంటూ రచ్చ చేయడం.. విజయ్ వాళ్లకు అభివాదం తెలుపుతున్న వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుండడం కూడా ఈ సినిమాకు బాలీవుడ్లో మంచి ప్లస్ అవుతోంది. అసలే ధర్మ ప్రోడక్షన్స్, పూరి కనెక్ట్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా… రమ్యకృష్ణ, మైక్‌టైసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం లైగర్ ట్రైలర్ అయితే యూట్యూబ్‌ను షేక్ చేసి పడేస్తోంది. ఇక ఈ సినిమా క్రేజ్ నేపథ్యంలో శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను ఓ ప్రముఖ సంస్థ రు. 55 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.
విజయ్ లాంటి హీరో సినిమాకు ఇది చాలా టాప్ రేటు అనే చెప్పాలి. కేవలం సినిమాపై ఉన్న క్రేజ్ నేపథ్యంలోనే ఇది సాధ్యమైంది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఆగస్టు 25న మరో పాన్ ఇండియా హీరో పుడతాడని పూరి కాన్ఫిడెంట్‌గా చెపుతున్నాడు. ఏదేమైనా లైగర్‌పై అంచనాలు, బజ్ అయితే మామూలుగా లేదు. మరి పూరి ఏం చేస్తాడో ? చూడాలి.