తెలుగువాడు అయినా తమిళంలో బాగా క్లిక్ అయ్యాడు విశాల్. నెల్లూరు జిల్లాకు చెందిన విశాల్ ఫ్యామిలీ ముందు నుంచే చెన్నైలో స్థిరపడింది. ఆ తర్వాత తన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తూ ఇక్కడ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ వచ్చే నెలలో తన 45వ యేట అడుగు పెట్టనున్నాడు. నాలుగున్నర పదుల వయస్సు వచ్చినా విశాల్ ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరు పెళ్లి చేసుకుంటూ ఉంటే విశాల్ మాత్రం ఇప్పటకీ పెళ్లి అన్న మాటే అనడం లేదు.
ఆరేడేళ్ల క్రితం నుంచే శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్‌కుమార్‌తో ప్రేమలో పడ్డాడు అన్న పుకార్లు చక్కెర్లు కొట్టాయి. ఈ ప్రేమ శరత్‌కుమార్‌కు ఇష్టం లేదన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత వరలక్ష్మి అయితే తాము మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పడంతో ఈ ప్రేమ పుకార్లకు చెక్ పెట్టినట్లయ్యింది. ఈ క్రమంలో 2019లో తెలుగమ్మాయి అనీషా రెడ్డితో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది.
అనీషా రెడ్డి విజయ్ దేవరకొండ అర్జున్‌రెడ్డి సినిమాలో నటించింది. ఆరు నెలల పాటు బాగానే ఉన్నా తర్వాత ఏమైందో కాని సడెన్‌గా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరిపోస్టులు మరొకరు డిలీట్ చేసుకున్నారు. ఆ తర్వాత విశాల్ కెరీర్ మీద కాన్సంట్రేషన్ చేస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.
ఆ తర్వాత విశాల్ నడిగర్ సంఘం కొత్త భవనం కట్టే వరకు తాను పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు బిల్డింగ్ పనులు ఓ వైపు నడుస్తున్నాయి. మరోవైపు పెళ్లి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. విశాల్ రీసెంట్ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడుతూ త్వరలోనే నా పెళ్లి ఉంటుంది.. ఇంట్లో చూసిన అమ్మాయిని చేసుకోవడం లేదు.. నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నా.. ఆమెతోనే నా పెళ్లి ఉంటుందని చెప్పాడు.
అయితే ఆమె ఎవరు ? అన్న విషయం మాత్రం విశాల్ రివీల్ చేయలేదు. ఏదేమైనా మొత్తానికి ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు విశాల్ చెప్పేశాడు.. ఆమె ఎవరు ? పెళ్లి ఎప్పుడు అన్నదే చూడాలి. ప్రస్తుతం విశాల్ లాఠీ, డిటెక్టివ్ 2, అభిమన్యుడు 2 సినిమాలు చేస్తున్నాడు.