రంభ..ఒక అగ్ర తారగా మారడానికి రెండు ప్రధాన కారణాలు. వాటిలో ఒకటి దివంతగత నటి దివ్యభారతి అయితే రెండు అగ్ర దర్శకులు కే రాఘవేంద్రరావు. 1993లో ప్రశాంత్, దివ్య భారతి జంటగా తొలిముద్దు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా దాదాపు చిత్రీకరణ పూర్తి కావస్తున్న సమయంలో ఆమె ఆత్మ హత్య చేసుకొని మృతి చెందింది. ఆ సమయంలో అదే పోలికలతో ఉన్న రంభను మిగిలిన షూటింగ్ కోసం తీసుకున్నారు. వైడ్ ఫ్రేంస్, సైడ్ ఫ్రేంస్ పెట్టి దివ్యభారతిలా చూపించారు. ఈ సినిమా మంచి హిట్ సాధించింది.
అయితే, తొలిముద్దు సినిమాలో రంభ చేసిన కొన్ని సన్నివేశాలే స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణకి నచ్చాయి. దాంతో ఆయన నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కించిన ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. ఆ రకంగా రంభ హీరోయిన్గా మొదటి సినిమా ఆ ఒక్కటీ అడక్కు అయింది. ఆ తర్వాత సరిగమలు, చిన్నల్లుడు వంటి సినిమాలు చేసింది. అయితే ఈ సినిమాలలో రంభ చేసింది సాంప్రదాయం కలిగిన పాత్రలు.
ఇలాంటి ఫ్యామిలీ హీరోయిన్లో పక్కా కమర్షియల్ హీరోయిన్ ని చూశారు సీనియర్ దర్శకులు కె రాఘవేంద్ర రావు. ఓ మంచి హీరోయిన్ ఎక్కడ ఉన్నా రాఘవేంద్రుడి కన్ను ఎలా పడిపోతుందో చెప్పక్కర్లేదు. ఎలాంటి హీరోయిన్ను అయినా ఓ రేంజ్లో చూపించి ఎలివేట్ చేసి.. ఆమె కెరీర్ మార్చడంలో రాఘవేంద్రుడిది అందెవేసిన చేయి. ఆయన దర్శకత్వంలో జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన బొంబాయి ప్రియుడు సినిమాలో రంభని హీరోయిన్గా తీసుకున్నారు.
ఈ సినిమాలో దర్శకేంద్రుడు రంభ మీద తన మార్క్ చూపించారు. నాభి, ఎద అందాలను వీలైనంతగా చూపించారు. అంతే, ఒక్క దెబ్బతో గ్లామర్ క్వీన్ అయింది రంభ. ఈ సినిమా తర్వాత రంభ చేసిన సినిమాలలో ఒక్క పాటైనా అందాల విందు ఇచ్చేలా ఉండేలా దర్శకులు ప్లాన్ చేశారు. బావగారూ బాగున్నారా లాంటి సినిమా దీనికి ఉదాహరణ. రంభ నందమూరి హీరోల సరసన కూడా నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య సరసన హీరోయిన్గా..భైరవ ద్వీపం సినిమాలో ప్రత్యేక గీతం బాగా పేరు తెచ్చాయి.
అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని ఆమె ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత తరం హీరోల సినిమాల్లోనూ ఆమె నటించింది. ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ నటించిన సినిమాలలో వారితో కలిసి ఐటెం సాంగ్స్ చేసి కూడా హీటెక్కించింది రంభ. ఆ తర్వాత రంభ భోజ్‌ఫురి భాషలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ప్రేక్షకులకు ఆరాధ్య దేవత అయిపోయింది. భోజ్‌పురి హీరోలు రవికిషన్సింగ్, మనోజ్ తివారితో కలిసి రంభ అక్కడ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. తర్వాత ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్ అయ్యింది.