అందాల తార సౌందర్య..ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం తో హోంలీ క్యారెక్టర్స్ తో కుటుంబ కధా చిత్రాలు చేస్తూ..ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. చక్కగా చీర కట్టుకుని..తల్లో పూలు పెట్టుకుని..అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే సౌందర్య అంటే..జనాలకు చాలా ఇష్టం. ఆమె చనిపోయింది అని తెలిసినప్పుడు సినీ పరిశ్రమే కాదు..ఆమె తల్లి లా..ఎంతో మంది తల్లులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. చలన చిత్ర పరిశ్రమలో ఆమె కంటూ ఓ ప్రత్యేక స్ధానాని ఏర్పర్చుకుంది సౌందర్య.
దివంగత కన్నడ కస్తూరి సౌందర్య దక్షిణ భారత దేశ సినీ చరిత్రలో తన సినిమాలతో చెరగని ముద్రవేశారు. సావిత్రి గారి తరువాత మరో సావిత్రి అంటూ పిల్చుకునే ఈమె..సావిత్రి గారిలానే తన నిజ జీవితంలో ఓ తప్పు చేసి..ఇప్పుడు వాళ్ల తల్లిదండ్రులు బాధపడేలా చేస్తుంది అంటున్నారు ఆమె దగ్గర బంధువులు. ఆమె కెరీర్ లో ఎందరో టాప్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. సౌందర్య దక్షిణాదిలో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళంలో కలిపి మొత్తం 12 సంవత్సరాల కెరీర్లో 100కు పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డ్ సృష్టించింది.
అయితే, కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ..తన దగ్గర బంధువుని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. నిజానికి ఈ పెళ్ళి సౌందర్య పేరంట్స్ కి ఇష్టం లేదట. కానీ, ఆమె బలవంతంగా వాళ్ళని ఒప్పించి మరి పెళ్ళి చేసుకుందట. పెళ్ళైన తరువాత కూడా అల్లుడు చేషటలతీ విసికిపోయారు సౌందర్య తల్లిదండ్రులు అన్న పుకార్లు వినిపించాయి. అయితే, దయలేని ఆ దేవుడు సౌందర్య ను చిన్న వయసులోనే తిరిగిరాని లోఖాలకు తీసుకెళ్ళిపోయాడు. ఆమె ఓ హెలికాఫ్టర్ ప్రమాదంలో స్పాట్ డెడ్ అయ్యింది.
ఆ తరువాత సౌందర్య ఆస్తులు గురించి పెద్ద చర్చే నడిచింది. కానీ, ఆమె భర్త రఘు ఒక్క రూపాయి కూడా వాళ్లకు ఇవ్వకుండా ..మొత్తం ఆమె కష్టార్జితాని అనుభవిస్తున్నాడు అంటూ జనాలు చెప్పుతున్నారు. ఆ నాడు సౌందర్య అతని పెళ్లి చేసుకోకుండా.. పేరంట్స్ చెప్పిన్నత్ళు వినుంటే..ఈనాడు వాళ్ల తల్లిదండ్రులకు ఈ బాధ ఉండేది కాదు అన్నది సామాన్యుల అభిప్రాయం..ఏది ఏమైన సౌందర్య తెలిసో తెలియకో కెరీర్ లో చేసిన తప్పుకు వాళ్ళ పేరంట్స్ అనుభవిస్తున్నారు.