సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప నటి అయినా 20, 30 సినిమాలు చేసినా కూడా నంది అవార్డ్ లాంటివి దక్కించుకోవడం చాలా కష్టం. అలాంటిది ప్రియమణి మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్‌ను అందుకున్నారు. పరుత్తివీరన్ ఆమె మొదటి సినిమా. ఈ సినిమాలోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ఇందులో ప్రియమణి అసలు మేకప్ లేకుండా తెరమీద కనిపించింది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలో దాదాపు 20 పై చిలుకు చిత్రాలు చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్‌కి కజిన్ అవుతుంది ప్రియమణి.
కానీ, బాలీవుడ్ సినిమాల కోసం ఎప్పుడు ఆమె సహాయం తీసుకోలేదు. హిందీలో ఆమె నటించిన సినిమా రావణ్. తెలుగులో ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు కొడుకు హీరోగా పరిచయమవుతూ నటించిన ఎవరే అతగాడు ప్రియమణికి మొదటి సినిమా. ఈ సినిమా అట్టర్ ఫ్లాపయినా కూడా జగపతి బాబు నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాలో అవకాశం అందుకొని మంచి పేరు తెచ్చుకుంది.
కథ కోసం అందులో పాత్ర కోసం ఎలాగైనా ప్రియమణి తనని తాను మార్చుకోగలదు. దానికి ఉదాహరణ పరుత్తివీరన్, పెళ్ళైన కొత్తలో, నితిన్ సరసన నటించిన ద్రోణ సినిమా లాంటివి. అవార్డ్ విన్నింగ్ మూవీ చేసిన ప్రియమణి నితిన్ కి జంటగా ద్రోణ సినిమా చేయడం అప్పట్లో ఓ హాట్ టాపిక్. దీనికి కారణం ఈ సినిమాలో బికిని వేసి షాకివ్వడమే. పోస్టర్స్ దగ్గర్నుంచే ఈ సినిమా విషయంలో ప్రియమణిపై ఇండస్ట్రీ వర్గాలలో, ప్రేక్షకులలో రక రకాల చర్చలు సాగాయి.
ద్రోణ సినిమాలో ప్రియమణి ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. ఇందులో యద అందాలను చూపిస్తూ బికినీ వేసి మెస్మరైజ్ చేసింది. అయితే, ప్రియమణిని ఇలా చూసిన కొందరు నెటిజన్స్..నేషనల్ అవార్డ్ అందుకున్న గొప్ప పర్ఫార్మర్ ఇలా బికిని వేయడం ఏంటీ అని కామెంట్స్ చేశారు. నెట్టింట్లో కూడా ఇప్పటికీ ద్రోణ సినిమాలో ప్రియమణి బికినీ ఫొటోలు మార్ఫింగ్ చేసినవి కొన్ని కనిపిస్తాయి. దీనికి సంబంధించిన తనకి ఎదురైన ఓ ప్రశ్నకు కూల్ గా సమాధానం చెప్పినా కొట్టినట్టే అవతలికి వారికి తగులుతుంది.
నాకు డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఇలా ఒక ఇంట్రో సాంగ్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఇది.. మీరు బికినీలో కనిపించాలి అని చెప్పారు. అది నాకు కన్విన్స్‌గా అనిపించే ఒప్పుకున్నాను. సినిమా కథకి ఏది కావాలో అది ఇవ్వడం ఆర్టిస్ట్‌గా నా బాధ్యత. నేషనల్ అవార్డ్ వచ్చిన నేను మరో సినిమాలో బికినీ వేయకూడదు అని రూల్ లేదు కదా..అలా ఉంటే నేనే కాదు ఎవరూ ఛాలెంజింగ్ రోల్స్ చేయలేరు అని క్లారిటీ ఇచ్చింది.