సాధారణంగా ఎవరింట్లోనైనా సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఉంటాయి కానీ అవి మామూలు వ్యక్తుల జీవితాల్లో వస్తే సంచలన విషయాలు ఎందుకు అవుతాయి చెప్పండి. సెలబ్రిటీస్ ఇళ్లల్లో ఉండే సమస్యలు మాత్రమే ప్రతి ఒక్కరికి సంచలనమైన విషయంగా కనిపిస్తూ ఉంటాయి. పైగా సెలబ్రెటీలు మాత్రమే ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ వరకు వెళుతూ ఉంటారు. అలా సెలబ్రిటీస్ లైఫ్ లో టీ కప్పులో తుఫానుగా వచ్చిన సమస్యలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా కూతుళ్లు తండ్రులపై లేదా తల్లులపై కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తమ కూతురు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మీడియాకెక్కిన తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి కొందరు సెలబ్రిటీస్, వారి గొడవలు ఏంటో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వనిత విజయ్ కుమార్ :
సౌత్ ఇండియాలోనే ప్రముఖ పాపులర్ నటీనటులైన మంజుల విజయ్ కుమార్ కుమార్తె వనిత. మంజుల బ్రతికినన్నాళ్లు, అలాగే చనిపోయిన తర్వాత విజయ్ కుమార్ తో వనితకు పోసిగిందే లేదు. ఎప్పుడు గొడవలు, చీటికిమాటికి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసులు పెట్టుకోవడం ఇది వీరి దినచర్యలో భాగమైపోయింది. చివరకు ఆమె వ్యక్తిగత జీవితం కూడా కంగాళీ అయిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని.. ఆ ముగ్గురు భర్తలకు దూరమైంది. ఇప్పుడు ఏకంగా నాలుగో పెళ్లికి కూడా రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
దునియా విజయ్ కుమార్ :
కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ కుమార్ భార్య పిల్లలు ఉండగానే మరొక పెళ్లి చేసుకోవడమే ఆయన జీవితంలో పెద్ద సమస్యగా మారింది. విజయ్ కుమార్ పై తన కూతురు కేసు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన తండ్రి తన తల్లి బ్రతికుండగానే మరొక ఆవిడతో ఉంటున్నాడు అంటూ తండ్రిపై గొడవకు వెళ్ళింది దునియా విజయ్ కుమార్తె. ఈ రకంగా కన్నడ ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు దునియా విజయ్ కుమార్. ప్రస్తుతం దునియా విజయ్ బాలయ్య 107 సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు.
లిజి :
సౌత్ ఇండియా సూపర్ స్టార్ హీరోయిన్ లిజీ గురించి మనందరికీ తెలుసు. తన కూతురు తనని బాగా చూసుకోవడం లేదని తనకసలు తిండి కూడా పెట్టడం లేదని లిజిపై కోర్టులో కేసు వేశాడు ఆమె తండ్రి. దీనికి రిప్లై గా అసలు నాకు తండ్రి అనేవాడే లేడు అంటూ లిజి పిటిషన్ వేయడం కోసం, చివరికి ఇది చిలికి చిలికి గాలివానై ఈ పంచాయితీ ఇప్పటికి నడుస్తూనే ఉంది. లిజి ఎవరో కాదు ప్రముఖ మళయాళ దర్శకుడు ప్రియదర్శన్‌కు మాజీ భార్య. ఈ దంపతుల కుమార్తే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని.
ఆంత్రమాలి :
తన మొత్తం ఆస్తిని అమ్మి తన కూతురిని హీరోయిన్ గా చేస్తే చరమాంకం లో తనను పట్టించుకోవడంలేదని ఆంత్ర మాలిపై ఆమె తండ్రి కేసు వేయడంతో బాలీవుడ్ లో ప్రకంపగల మొదలయ్యాయి. చివరికి మీడియా కూడా కలగజేసుకోవడంతో కోర్టు బయట తన తండ్రితో సెటిల్మెంట్ చేసుకుంది ఈ హీరోయిన్. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని మనవడు సుమంత్ హీరోగా వచ్చిన ప్రేమకథ సినిమాలో ఆమె హీరోయిన్‌గా చేసింది.
సంగీత :
తన కూతురు తనని చూసుకోవడం లేదంటూ సంగీత తల్లి కోర్టులో కేసు వేసింది. కానీ తన జీవితమంతా కూడా తన తల్లికి ధారపోసానంటుంది సంగీత. ఆస్తులు సంపాదించడం కోసం తనను హీరోయిన్ గా చేసి తన జీవితాన్ని నాశనం చేసింది తన తల్లి అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది సంగీత.
కుష్బూ :
నటి కుష్బూ సైతం పలుమార్లు తన తండ్రి గురించి మీడియాలో అనేక వ్యాఖ్యలు చేసింది తనకు అసలు తండ్రి అనే వాడే లేడు అంటూ కుష్బూ వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. తన తండ్రి వల్లే మా జీవితం అంతా కూడా వ్యర్థమైపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కానీ చరమాంకంలో తనకు తిండి కూడా గతి లేదంటూ కుష్బూపై లీగల్ నోటీసులు పంపించాడు ఆమె తండ్రి.