మాజీ ప్రపంచ సుందరి తన కెరీర్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటే తన సినిమాల కన్నా ఎఫైర్లతోనే ఎక్కువుగా వార్తల్లో నిలిచింది. మరో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ సినిమాలతోనే బాగా పాపులర్ అయ్యి.. స్టార్ హీరోయిన్ అయ్యింది. వాస్తవానికి సుస్మిత ఆ రేంజ్ స్టార్ హీరోయిన్ కాలేదు. ఇందుకు ఆమె చేజేతులా చేసుకున్న తప్పులే కారణం. తాజాగా లలిత్మోడీతో లేటు వయస్సులో ఘాటు ప్రేమతో వార్తల్లోకి ఎక్కింది. విదేశాల్లో లలిత్ మోడీకి ఆమె ముద్దులు పెడుతోన్న ఫొటోలు ఎంతలా వైరల్ అయ్యాయో చూస్తూనే ఉన్నాం.
ప్రస్తుతం సుస్మిత లలిత్ తో ఎఫైర్ పెట్టుకున్నా గతంలో ఆమె మరో 8 మంది సెలబ్రిటీలతోనూ ప్రేమలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫొటోలు వార్తలు అందరికి తెలిసిందే. మరి ఆమె ఇంతకు ముందు ఎవరెవరితో ఎఫైర్లు నడిపిందో ఆ లిస్ట్ చూద్దాం.
1- విక్రమ్ భట్ :
1996 నుంచి 2022 వరకు ఈ పాతికేళ్ల కాలంలో సుస్మితాసేన్ 9 సార్లు ప్రేమలో పడింది. ఆమె తొలి సినిమా దస్తక్. ఆ సినిమా షూటింగ్ టైంలోనే ఆమె విక్రమ్ భట్‌తో ప్రేమాయణం నడిపిందన్న గుసగుసలు బీ టౌన్లో వినిపించాయి. అయితే అప్పటికే విక్రమ్‌కు పెళ్లయ్యింది. సుస్మిత ప్రేమలో పడి కొన్నాళ్లు తన కుటుంబానికి కూడా విక్రమ్ దూరమయ్యాడని అంటారు.
2- రణదీప్ హుడా :
కర్మ, హోలీ సినిమాల్లో తనతో నటించిన రణదీప్ హూడాతో కూడా సుస్మిత ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత వీరి మధ్య బ్రేకప్ అయినా వీరు మాత్రం బయట ఇప్పటకీ స్నేహితులుగానే ఉంటారు.
3- రితిక్ బాసిన్ :
ముంబైలో ప్రముఖ బిజినెస్‌మేన్ అయిన రితిక్ బాసిన్తో కూడా సుస్మిత కొద్ది రోజులు ప్రేమలో పడింది. వీరిద్దరు కలిసి అప్పటి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జహీర్‌ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక పెళ్లికి సైతం హాజరయ్యారు. తర్వాత వీరు బ్రేకప్ చెప్పేసుకున్నారు.
4- సబీర్ భాటియా :
హాట్‌మెయిల్ ఫాండర్ అయిన సబీర్ భాటియాతో సైతం సుస్మిల కొన్నాళ్లు ప్రేమాయణం నడిపింది. అయితే ఈ ప్రేమ కూడా ఆమెకు కలిసి రాలేదు.
5- వసీమ్ అక్రమ్ :
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ ఆక్రమ్తో సైతం సుస్మిత లవ్‌లో పడింది. వీరిద్దరు కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని మరీ దుబాయ్‌లో తిరిగారు. ఆ తర్వాత వీరు ఎవరిదారులు వారు చూసుకున్నారు.
6- బంటి సచ్దేవ్ :
ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కార్నర్ స్టోన్ పౌండర్ బంటి సచ్దేవ్తో కూడా సుస్మిత కొన్నాళ్లు ప్రేమాయణం నడిపింది. తర్వాత తాము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ షాక్ ఇచ్చింది.
7- ఇంతియాజ్ ఖత్రి :
ఇక ఇంతియాజ్ ఖత్రితో సుస్మిత ప్రేమ మరీ దారుణం. ఆమెకు 36 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు కేవలం 22 ఏళ్ల వయస్సులో ఉన్న ఇంతియాజ్‌తో ప్రేమలో పడింది. అంటే ఇంతియాజ్ ఆమె కంటే 14 ఏళ్లు చిన్నోడు. వీరు గోవాలో ర్యాంప్ వాక్ చేశారు. తర్వాత సుస్మితే కటిఫ్ చెప్పేసింది.
8- రోహమన్ పాల్ :
ఇక ఇంతియాజ్ ఖత్రిని వదిలేశాక తనకంటే చాలా చిన్నోడు అయిన రోహమన్ పాల్‌తో సహజీవనం చేసేసింది. రోహమాన్ పాల్ ఓ ఫ్యాషన్ మోడల్. సుస్మిత కంటే 15 ఏళ్లు చిన్నోడు. అసలు జిమ్‌లో కూడా వీరిద్దరు ఘాటుగా వాటేసుకుని మరీ పొటోలు పోస్ట్ చేసేవారు. తర్వాత వీరిద్దరు విడిపోతున్నట్టుగా అదే సోషల్ మీడియాలో కలిపి పోస్టులు పెట్టి మరీ విడిపోయారు.
9- లలిత్ మోడీ :
ఇక ఇప్పుడు తన కంటే వయస్సులో 10 ఏళ్లు పెద్దవాడు అయిన ఐపీఎల్ పౌండర్ లలిత్మోడీతో ఆమె ప్రేమలో పడింది. లలిత్ మోడీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లు సెటిల్ అయిపోయారు. ఆయన భార్య కూడా తన కంటే 10 ఏళ్లు పెద్ద కావడంతో క్యాన్సర్‌తో పోరాడి మృతిచెందింది. ఇప్పుడు తనూ ఒంటరివాడే. ఇటు సుస్మిత కూడా ఒంటరే. మోడీ దగ్గర కావాల్సినన్ని డబ్బులు ఉన్నాయి. ఇంకేముందు ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని ఒక్కటయ్యారు. మరి ఈ బంధం ఎన్ని రోజులు ఉంటుందో ? చూడాలి.