మన సినిమా ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అనే సెంటిమెంట్ బాగా ఉంటుంది. ఒక హీరోహీరోయిన్ కలిసి ఓ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే అదే జంటతో మళ్ళీ కలిపి సినిమా చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా నందమూరి నట సింహం బాలకృష్ణ సరసన నటించిన చాలా మంది హీరోయిన్స్ ఆ తర్వాత మంచి క్రేజ్ తెచ్చుకొని అన్నీ రకాలుగా బాగా సెటిలయ్యారు. అలాంటి హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం.
బాలకృష్ణ – విజయశాంతి :
బాలకృష్ణ – విజయశాంతి జోడీది అల్టిమేట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి 17 సినిమాల్లో నటించారు. ఈ కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కథానాయకుడు, పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య, లారీడ్రైవర్, రౌడీఇన్‌స్పెక్టర్, నిప్పురవ్వ, దేశోద్ధారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవరాముడు, సాహస సామ్రాట్, మువ్వగోపాలుడు, భానుమతిగారి మొగుడు, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, భలేదొంగ, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, తల్లిదండ్రులు సినిమాలు చేశారు. అసలు వీళ్ల కాంబినేషన్లో ఇప్పుడు సినిమా వచ్చినా ఎంతో క్రేజ్ ఉంటుంది. అప్పుడు విజయశాంతికి తిరుగులేని క్రేజ్ రావడానికి బాలయ్య సినిమాలే కారణం.
బాలకృష్ణ – సిమ్రాన్:
వీరిద్దరి కాంబినేషన్‌లో గొప్పింటి అల్లుడు. సమరసింహా రెడ్డి, ఒక్క మగాడు, సీమ సింహం, నరసింహ నాయుడు లాంటి చిత్రాలొచ్చాయి. వీటిలో దాదాపు అన్నీ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. వీరిది సూపర్ హిట్ కాంబినేషన్ అని పేరుంది. బాలయ్య సరసన నటించిన తర్వాతే సిమ్రాన్ టాలీవుడ్‌లో బాగా సెటిలైంది. ఇందులో సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాలు రెండూ ఇండస్ట్రీ హిట్లు.
బాలకృష్ణ – నయనతార:
బాలయ్య సరసన నటించిన నయతార మంచి హిట్స్ అందుకుంది. వీరి కాంబోలో శ్రీరామరాజ్యం, సింహా, జై సింహా చిత్రాలొచ్చాయి. వీటిలో నయన్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన సినిమాలంటే భక్తిప్రధానంగా వచ్చిన శ్రీరామరాజ్యం, ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సింహ. ఈ రెండు నయన్‌కు మైల్‌స్టోన్ లాంటి సినిమాలు.
బాలకృష్ణ – సోనాల్ చౌహాన్:
హిందీలో జన్నత్ సినిమాతో హీరోయిన్‌గా మారిన సోనాల్ చౌహాన్ తెలుగులో రెయిన్ బో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ, బాలయ్య సరసన నటించిన తర్వాతే ఈ యంగ్ బ్యూటీ లైఫ్ టర్న్ అయింది. ఇటీవల కాలంలో బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ సోనాల్. బాలయ్య సరసన లెజెండ్, రూలర్, డిక్టేటర్ సినిమాలు చేసింది. ఆ తర్వాతే నాగార్జున సరసన సినిమా అవకాశం దక్కింది. బాలయ్యతో నటించకపోతే సోనాల్ కి ఇక్కడ లైఫ్ ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు.
బాలకృష్ణ – రమ్యకృష్ణ:
బాలయ్యతో రమ్యకృష్ణ నాలుగు సినిమాలు చేసింది. అప్పట్లో రమ్యకృష్ణ అంటే ఐరెన్ లెగ్ అనే పేరుండేది. అయినా బాలయ్య అలాంటివేవీ పట్టించుకోకుండా నాలుగు సినిమాలలో అవకాశం ఇచ్చారు. వంశోద్ధారకుడు, వంశానికొక్కడు, దేవుడు, బంగారు బుల్లోడు. అయితే, వీరి కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ పడకపోవడం కాస్త ఆశ్చేరకరమే. వీరి కాంబోలో బంగారు బుల్లోడు, వంశానికొక్కడు రెండు సినిమాలు మంచి హిట్ అయ్యాయి.