ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ కావడం లేదా డాక్టర్ కొడుకు డాక్టర్ కావడం సర్వసాధారణం. అలాగే ఒక నటి చెల్లి హీరోయిన్‌గా మారి సక్సెస్ అయిన సందర్భాలు కూడా మనం అనేకం చూసాం. ఇద్దరు తోబుట్టువులు కలిసి ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న వారు ఉన్నారు. కానీ ఇద్దరికి మించి అంటే ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఇండస్ట్రీలో కొనసాగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. మన సౌత్ ఇండియాలో కేవలం నలుగురు మాత్రమే ముగ్గురు తోబుట్టువులుగా కలిసి ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించారు. మరి ఆ అక్క చెల్లెలు ఎవరో తెలుసుకుందాం.
ట్రావెన్ కోర్ సిస్టర్స్ – లలిత, పద్మిని, రాగిణి :
సినిమా ఇండస్ట్రీ మొదలైన తొలినాళ్లలో అంటే 1940 లలో ట్రావెన్ కోర్ సిస్టర్స్ గా ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లు ఎంతో ఫేమస్ అయ్యారు. తమ టాలెంట్‌తో సినిమా ఇండస్ట్రీలో ఎంతో సముచితమైన స్థానాన్ని దక్కించుకున్నారు. రాగిణి, పద్మిని, లలిత కేవలం సినిమాలతోనే కాదు. ఈ ముగ్గురు నాట్యకారులు కూడా. తొలితరం హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చిన కూడా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు.
నగ్మా, జ్యోతిక, రోషిణి :
ఇక ఈ ముగ్గురు హీరోయిన్ల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1990 తర్వాత నగ్మా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన మొదటి సోదరి జ్యోతిక ఆ తర్వాత ఆ రోషిణి.. ఇలా ముగ్గురు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తమ హవా కొనసాగించారు. చిరంజీవితో నటించిన ఏకైక త్రయంగా ఈ ముగ్గురు ఒక రికార్డును సాధించారు. ఈ ముగ్గురు నటీమణులు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు సోదరిమణులు మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటించారు.
వనిత విజయ్ కుమార్, ప్రీతి విజయకుమార్, జూనియర్ శ్రీదేవి :
అలనాటి స్టార్ హీరోయిన్ మంజుల తన తోటి నటుడైన విజయ్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు కుమార్తెలు వనిత, ప్రీతి, శ్రీదేవి. ఈ ముగ్గురు కూడా ఆ సినిమా ఇండస్ట్రీలోనే తమ కెరియర్ ప్రారంభించారు. ఇక వనిత విజయ్ కుమార్ ని దేవి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయగా తమిళంలో మరికొన్ని సినిమాల్లో నటించిన ప్రస్తుతం ఆమె టెలివిజన్ షోస్ తో బిజీగా ఉంది.
రుక్మిణి కళ్యాణం అనే సినిమాతో ప్రీతి విజయకుమార్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవగా.. మరికొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాలో ఎక్కడా కనిపించడం లేదు. ఇక జూనియర్ శ్రీదేవిగా పేరు సంపాదించుకున్న నటి శ్రీదేవి ప్రభాస్ తో తెలుగులో నటించి.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది. ఇక ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుని సెటిలైంది.
కల్పన, కళారంజని, ఊర్వశి :
మళయాళ ఇండస్ట్రీలో తొలిత తమ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో నటించిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు తొలిరోజుల్లో హీరోయిన్స్ గా అనేక సినిమాల్లో నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ప్రస్తుతం అనేక సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో కల్పన హైదరాబాదులో ఒక హోటల్లో కన్నుమూయాగా, ఊర్వశి చాలా బిజీ ఆర్టిస్ట్ గా తన కెరియర్ కొనసాగిస్తోంది.