Moviesటాలీవుడ్‌లో ఈ 10 మంది స్టార్లు బంధువులే... మీకు తెలుసా...!

టాలీవుడ్‌లో ఈ 10 మంది స్టార్లు బంధువులే… మీకు తెలుసా…!

త‌మ‌ కుటంబంలో ఎవ‌రో ఒక‌రు న‌టులై ఉంటే చాలు.. వారికి సంబంధించిన వారిని ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తున్నారు. అలా ప్ర‌మోట్ చేసిన వారిలో టాలాంట్ ఉన్న న‌టులు మంచి పేరు తెచ్చుకుని స్టార్లుగా ఎదుగుతున్నారు. టాలెంట్ లేకపోతే మ‌త్రం ఎంత సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా క‌నుమ‌రుగై పోతున్నారు. ఇండ‌స్ట్రీలో కొంత‌మంది న‌టీన‌టుల మ‌ధ్య బంధుత్వం ఉంద‌ని చాలా త‌క్క‌వ మందికి తెలుసు. సినిమా ఇండ‌స్ట్రీ, రాజ‌కీయాలు అంటేనే అంతా బంధుగ‌ణంతో నిండిపోతుంది మ‌నదేశంలో..!

 

సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు ఏ భాష‌లో చూసిన సినిమా రంగంలో వార‌సుల రాజ్యమే న‌డుస్తుంది. ఇక తెలుగు సినిమా రంగంలో 7, 8 ద‌శాబ్దాల చ‌ర్రిత‌లో ఎక్కువుగా వార‌సులే కంటిన్యూ అవుతూ వ‌స్తున్నారు. వార‌సులే స్టార్ హీరోలుగా చెలామ‌ణి అవుతున్నారు. అక్కినేని, నందమూరి ఫ్యామిలీల నుంచి ఏకంగా మూడో త‌రం హీరోలు కూడా వ‌చ్చి రాణిస్తున్నారు. అలా టాలీవుడ్ లో బంధుత్వాలు ఉన్న న‌టీన‌టులు ఎవ‌రో మ‌నం తెలుసుకుందాం..!

1. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ అక్క కూతురినే గోపిచంద్ వివాహం చేసుకున్నాడు. శ్రీకాంత్ మేన‌కోడ‌లు రేష్మీ తో గోపిచంద్‌కు వివాహం జ‌రిగింది. రేష్మీ కంటే ముందు ఓ పారిశ్రామికవేత్త‌ కూతురుతో గోపీచంద్‌కు ఎంగేజ్మెంట్ జ‌రిగినా… త‌ర్వాత క్యాన్సిల్ అయ్యింది. ఇలా గోపిచంద్‌.. శ్రీకాంత్ బంధువులు అయ్యారు.

2. పోసాని కృష్ణముర‌ళీ – బోయ‌పాటి శ్రీను – కొర‌టాల శివ :
సినియ‌ర్ న‌టుడు క్యారక్ట‌ర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ట‌ముర‌ళీ… మాస్ సినిమాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను వ‌రుస‌కు క‌జిన్స్ అవుతారు. బోయ‌పాటిని ఇండ‌స్ట్రీకీ తీసుకువ‌చ్చి ఆస్టింట్ డైర‌క్ట‌ర్ గా చేర్పించింది పోసానియే. మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల‌ శివ.. పోసాని స్వ‌యానా మేనమామ – మేన‌త్త కొడుకులు కావ‌డం విశేషం.

3. సీనియర్ సినిమాటోగ్రాఫ‌ర్ చోటాకె. నాయుడు మేనళ్లుడు యంగ్ హీరో సందీప్ కిషన్. మేనమామ ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చిన సందీప్ కిషన్ టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు.
4.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈరోజు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోద‌రుడి కుమార్తెనే త్రివిక్రమ్ వివాహం చేసుకున్నాడు.
5.సీనియర్ గేయ రచయిత విప్లవకవి సుద్దాల అశోక్ తేజకు నటుడు ఉత్తేజ్ స్వయానా మేనల్లుడు కావడం విశేషం.

 

6. టాలీవుడ్ డైరెక్టర్ల‌లో ఒకరైన మెహర్ రమేష్ మెగా ఫ్యామిలీకి బంధువు అవుతాడు. వరుసకు మెగా బ్రదర్ నాగబాబు.. మెహర్ రమేష్ కజిన్స్ అవుతారు.
7. యంగ్ హీరోలు రామ్ – శర్వానంద్ స్వయానా బావబావ‌మరుదులవుతారు. శర్వానంద్ సోదరుడు రామ్ సోదరిని వివాహం చేసుకోవడంతో వీళ్ళిద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది.
8. 7/ జి బృందావన్ కాలనీ సినిమాలో హీరోగా నటించిన రవికృష్ణ సినిమా నిర్మాత ఎయం.రత్నం కుమారుడు.
9. దర్శక ధీరుడు రాజమౌళి భార్య ర‌మా రాజమౌళికి గుణ్ణం గంగరాజు సోదరుడు అవుతాడు.. ఈ లెక్కన రాజమౌళి గంగరాజు బావ బామ్మర్దులు అవుతారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news