టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు ఒకప్పుడు క్రేజ్ ఉండేది. దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్ – ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాలు వస్తే అప్పట్లో ప్రేక్షకులకు పెద్ద పండుగ లాగా ఉండేది. అయితే కాలక్రమంలో 1980వ దశకం దాటక మల్టీస్టారర్ సినిమాలు అంతరించి పోయాయి. స్టార్ హీరోలు ఎవరికి వాళ్లు ప్రత్యేకమైన ఇమేజ్ ఉండంతో పాటు హీరోల మధ్య పోటీ వాతావరణం ఎక్కువగా ఉండంతో మల్టీస్టార్ సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు కాదు. అయితే గత 10 సంవత్సరాలుగా తెలుగు లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన తరం స్టార్ హీరోలతో, యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
ఇక తాజాగా వచ్చిన RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించి పెద్ద సంచలనం లేపారు. టాలీవుడ్ లో నందమూరి – అక్కినేని ఫ్యామిలీలు రెండూ మూల స్తంభాలుగా ఉంటూ వస్తున్నాయి. ఈ రెండు కుటుంబాల నుంచి మూడో తరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత వారి వారసులుగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్‌లో మల్టీస్టారర్ సినిమా వస్తుందని రెండు కుటుంబాలకు చెందిన సినీ అభిమానులు ఆశపడ్డారు. అయితే వాళ్ళ ఇద్దరి కాంబోలో మల్టీస్టారర్ రాలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ క్లాసికల్ మూవీ గుండమ్మ కథ సినిమాను ఈతరం జనరేషన్‌కు తగ్గటు మార్పులు చేసి బాలకృష్ణ, నాగార్జునతో తెరకెక్కించాలని చాలా మంది దర్శకులు ప్రయత్నాలు చేశారు. అయినా ఈ సినిమా మొదలు అవ్యలేదు.
అయితే మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమాను బాలకృష్ణ, నాగార్జునతో రీమేక్ చేయాలని కూడా ప్రయత్నాలు జరిగాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ బాబు వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా తీసేందుకు చాలా ప్రయత్నం చేశారు. బాలయ్య, నాగార్జునలను కూడా ఒప్పించారు. బాలయ్య స్వయంగా నాగార్జునకు ఆ సినిమా ఒరిజినల్ డీవీడీ ఇచ్చి సినిమా చూడమని కూడా చెప్పారు. ఈ కథ నచ్చటంతో నాగార్జున కూడా బాలయ్యతో మల్టీస్టారర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమాకు డైరక్టర్ ఎవరు ? అన్నదానిపై ఐదారు నెలల పాటు వర్క్అవుట్ కూడా జరిగింది. 2010లో ఈ సంఘటన జరిగింది.
నాగార్జున ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపాడు. అదే సమయంలో నాగచైతన్య ఈ ప్రపోజల్ గురించి తెలుసుకుని నాగార్జున దగ్గరకు వచ్చి తారక్ – నేను కలిసి గుండమ్మకథలో నటిస్తామని చెప్పాడట. దీనికి తోడు బాలయ్య – నాగార్జున కాంబినేషన్‌కున్న డైరెక్టర్ ఎవరు ఫిక్స్ అవకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత నాగార్జున – బాలయ్య మధ్య సఖ్యత లేదనే వార్తలు వచ్చాయి. దాదపు ఐదు ఆరు సంవత్సరల పాటు సరిగ్గా మాట్లాడుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే విశాఖపట్టణంలో సుబ్బిరామిరెడ్డి నిర్వహించిన ఓ ఫంక్షన్‌లో తమ ఇద్దరి మధ్య గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు నాగ్. బాలయ్య సమక్షంలోనే ఇదంతా జరిగింది.
ఏదేమైనా ఆ తరువాత నందమూరి – అక్కినేని వంశంలో రెండో తరం, మూడో తరం హీరోలు కలిసి నటించలేదు. అయితే నందమూరి ఫ్యామిలీ మరో వారసుడు హరికృష్ణ, నాగార్జున కాంబినేషన్‌లో సీతారామరాజు సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు వై.వి.స్.చౌదరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగర్జున,హరికృష్ణ అన్నదమ్ములుగా నటించారు. అయితే నందమూరి – అక్కినేని అభిమానులు అశించినట్టు బాలయ్య – నాగార్జున మల్టీస్టారర్ అలా మరుగున పడి పోయింది.