తెలుగు సినిమా రంగంలో దివంగత నటరత్న ఎన్టీఆర్ కెరీర్‌లో బొబ్బిలిపులి సినిమాకు చాలా స్పెషాలిటీ ఉంది. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులు అన్నింటిని తిరగరాసింది. ఆ టైంలో ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి బీజం పడింది.
1982 జూలై 9న బొబ్బిలిపులి సినిమా రిలీజ్ అయ్యింది. అప్పటి వరకు ఇదే ఇండస్ట్రీ రికార్డ్. నాడు తాత బొబ్బిలిపులి సినిమాతో అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులకు పాతరేస్తే నేడు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తాజా సినిమా త్రిబుల్ ఆర్‌తో ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఉన్న ఎన్నో పాత రికార్డులకు పాతరేశాడు.
బాహుబలితో పోలిస్తే త్రిబుల్ ఆర్ తక్కువ వసూల్లే సాధించినా.. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే త్రిబుల్ ఆర్ వసూళ్లే ఎక్కువుగా ఉన్నాయి. అలా టాలీవుడ్‌లో నాడు తాత ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేస్తే.. ఇప్పుడు మనవడు ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాడు. ఇలా అరుదైన రికార్డ్.. ఒకే కుటుంబానికి చెందిన తాత, మనవడు క్రియేట్ చేయడం నిజంగా గొప్ప విషయమే.
ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫామ్‌లో ఎన్టీఆర్ ఉన్నాడు. ఆరు వరుస హిట్లతో దూసుకుపోతుండడంతో పాటు నెక్ట్స్ కూడా స్ట్రాంగ్ లైనఫ్‌లో ఉన్నాడు.