సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం కామన్. అయితే కొన్ని జంటలు పెళ్లి పీటలు ఎక్కితే మరికొన్ని ప్రేమలకు మధ్యలనే ఎండ్ కార్డ్ పడిపోతుంది. అంతే కాకుండా ఇద్దరి మధ్యన ప్రేమ లేకున్నా హీరోహీరోయిన్ లు క్లోజ్ గా కనిపించినా వాళ్లు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ గాసిప్స్ పుట్టుకు వస్తాయి. తమిళ హీరో కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ప్రేమించుకున్నారని అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ వార్త సౌత్ ఇండియాలోనే హాట్ టాపిక్ అయ్యింది.
హీరో కార్తీ – తమన్నా మొదటగా కలిసి ఆవారా సినిమాలో నటించారు. ఈ సినిమా తమిళ్ లో పెద్దగా ఆడలేదు… కానీ టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. లింగుస్వామి ఈ సినిమాకు దర్శకుడు. రోడ్ జర్నీ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో కార్తీ, తమన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కార్తీ – తమన్నా కలిసి తెగ సందడి చేసేవారు. ఆ సమయంలో ఇద్దరూ చాలా క్లోజ్ గా కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి.
అంతే కాకుండా తమన్నాను.. కార్తీ వివాహం చేసుకున్నాడు అంటూ తమిళ, తెలుగు మీడియాలో వార్తలు మొదలయ్యాయి. దాంతో ఈ వార్తల పై కార్తీ స్పందించాడు. తాను చిన్నప్పటి నుండి బాయ్స్ స్కూల్ మరియు కాలేజీలలో చదువుకున్నానని చెప్పాడు. తాను తమన్నా తో కలిసి ఒకటి రెండు సినిమాల్లో నటించానని.. అంతదానికే ఇలాంటి వార్తలు ఎలా ? ప్రచారం చేస్తారని అన్నాడు. మరోవైపు తాను ఈ వార్తలను ఎంజాయ్ చేస్తున్నానని కూడా చెప్పాడు.
హీరో కార్తీ క్లారిటీ ఇచ్చిన తరవాత కూడా వార్తలు ఆగలేదు. కార్తీ పెళ్లి సమయంలో తమన్నాతో పెళ్లి ఇష్టం లేకనే హీరో తండ్రి వేరే వివాహం జరిపించాడని వార్తలు మొలయ్యాయి. కార్తీ తన సొంత మరదలినే పెళ్లాడాడు. కొంతకాలం తరవాత తమన్నా తన సినిమాలతో బిజీ అవ్వడం కార్తీ కూడా సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్ బిజీ అవ్వడంతో వీరిద్దరి ప్రేమ వార్తలకు చెక్ పడింది. ఇక ప్రస్తుతం మిల్కీ బ్యూటీ సీనియర్ హీరోలకు కూడా జోడీగా నటిస్తోంది. కార్తీ సైతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
కార్తీతో ప్రేమాయణం వార్తల తర్వాత తమన్నా ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమలో పడినట్టు కూడా వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌లో ఒకటి అరా సినిమాలు చేసిన టైంలోనే ఈ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సీనియర్ హీరోలకు ఆమె ఆప్షన్‌గా ఉండడంతో పాటు మంచి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ టైంలో పెళ్లి చేసుకుంటే ఆ ఛాన్సులు కూడా రావనే ప్రస్తుతం పెళ్లికి దూరంగా ఉంటోంది.