పాపం శ్రావణ భార్గవి.. నిన్న మొన్నటి వరకు ఓ స్టార్ సింగర్ లా చూసిన ఈమెను ఇప్పుడు అంతా..ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మొన్న ఏమో భర్త తో డివర్స్ తీసుకుంది అని ..నానా హంగామ తెర పైకి వచ్చింది. స్టార్ సింగర్స్ హేమ చంద్ర, శ్రావణ భార్గవి..లు విడాకులు తీసుకోబోతున్నరంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ వారం రోజులు ఈ డివర్స్ హంగామా బాగానే నడిచింది. ఆ తరువాత వాళ్ళే మేమి విడాకులు తీసుకోవట్లేదురా బాబోయ్ అంటూ చెప్పుకొచ్చారు.
సరే, అంతా బాగానే ఉందిలే అనుకుంటే,,ఇప్పుడు అనుకోని చిక్కులో పడ్డింది. రీసెంట్ గా ఆమె అన్నమయ్య రాసిన ‘ఒకపరికొకపరి వయ్యారమై…’ కీర్తనను తన దైన స్టైల్ లో పాడింది. నో డౌట్ శ్రావణ భార్గవి చాలా చక్కగా పాడింది. జనాలకు బాగా నచ్చింది. అతి కొద్ది టైంలోనే ఎక్కువ వ్యూయ్స్ కూడా వచ్చాయి. ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న టైంలో బిగ్ బాంబ్ పేల్చారు కొందరు అన్నమయ్య భక్తులు. ఆ పాటలో ఆమె భక్తి భావంతో కాకుండా.. వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి చిత్రీకరించడం పట్ల తప్పుబట్టారు.
దీని గురించి పెద్ద ఎత్తున జనాలు శ్రావణ భార్గవిని తప్పు పడుతున్నారు. ఈ క్రమంలోనే..బీజేపీ నాయకురాలు శ్వేతా రెడ్డి రియాక్ట్ అయ్యింది. ఈ మేరకు ఓ స్పెఫీ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఆమె మాట్లాడుతూ…శ్రావణ భార్గవి పై మండిపడింది. “ఎంతో మంది మంచి మంచి సింగర్స్ అన్నమయ్య పాటలకు ఎంత చక్కగా భక్తి భావంతో పాడుతారు.
కానీ, నువ్వు నీకు నచ్చిన్నట్లు అడ్డదిడ్డంగా కాలు ఊపుతూ పాడావు. నీకు డివర్స్ డిప్రెషన్ ఉంటే వేరే వీడియోలు చేసుకో..అంతేకానీ, ఇలా హిందు దేవుడులను కించపరచకు. నువ్వు నీ కోతి మొహం..నీ చింపాజీ ముఖం పై పాటలు రాసుకుని పాడుకో..మన దేవుడిని మనమే అవమానిస్తామా..నీకే కాదు..అందరి సింగర్లకి..బోంగర్లకి చెప్పుతున్న..దేవుడి పాటలని కించపరచకండి..”అంటూ ఓ రేంజ్ లో శ్రావణ భార్గవి పై ఫైర్ అయ్యింది శ్వేతా రెడ్డి.