టాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలపై అగ్ర నిర్మాతలు , ఇండస్ట్రీ పెద్దలు అందరు కూర్చున్ని సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ గిల్డ్.. ఛాంబర్ అనే రెండుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ గిల్ట్ మీటింగ్ లో అగ్ర నిర్మాతలు ఉన్నారు ఛాంబర్ జనాలు నిర్మాణంలో యాక్టివ్‌గా లేకపోయినా ఆఫీషియల్ బాడీగా కొనసాగుతున్నారు. వీరంతా సినిమా నిర్మాణాలు బంద్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లో అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఎక్కడా కనిపించటం లేదు. ఆయన టాలీవుడ్ లో ఒక స్టూడియో అధినేత. ఏపీ, తెలంగాణలో ఎక్కువ థియేటర్లు నిర్వహిస్తున్నన ఎగ్జిబిటర్.
ఇటు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత. అయన ఇంట్లోనే ఇద్దరు పెద్ద హీరోలు వెంకటేష్, రానా ఉన్నారు. అయన రెండో కుమారుడు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గత వారం రోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న హడావిడిలో సురేష్‌బాబు ఎక్కడా కనబడడంలేదు. ఆయన పేరు కూడా వినిపించటం లేదు. కానీ ఆయన యాక్టివ్ ప్రొడూసర్స్ టీమ్ అయన గిల్డ్ లో మెంబర్‌గా ఉన్నారు. వాస్తవంగా చూస్తే ఏ సంద్బంలో అయినా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం సురేష్‌బాబు స్టైల్.
కానీ ఇప్పడు ఇంత హడావిడి జరుగుతున్నా ఆయన మాటలు మత్రం వినిపించటం లేదన్న దానిపై ఇండస్ట్రీలో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచరం ప్రకారం దిల్ రాజు కనుసన్నల్లో నడుస్తున్న గిల్డ్ వ్యవహారాలకు సురేష్‌బాబు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే దిల్‌రాజుకు పెద్ద షాక్ ఇచ్చినట్టే చెప్పాలి. అలాగే తాజా పరిణామాలపై జరిగిన సభ్యుల సంతకాల కోసం గిల్డ్ పంపిన పేపర్లపై కూడా సురేష్ బాబు సంతకం పెట్టేందుకు ఇష్ట పడలేదు అట.
ట్విస్ట్ ఏంటంటే సురేష్‌బాబుకు వ్యాపార భ్యాగస్వామిగా, సూపర్ స్టార్ మహేష్ బాబుకు వ్యాపార భాగస్వామిగా ఉన్న ఆసియన్ సునీల్ కూడ ఈ కమిటీలో కీలకంగా ఉండి కూడా గప్‌చుప్‌గా ఉన్నాడు. ఏదేమైనా దిల్ రాజు ఈ విషయంలో ఒంటరి అయిపోయాడు అనే చెప్పాలి. సి. కళ్యాన్ లాంటి ఒకరిద్దరు మినహా రాజు వెంట సురేష్ బాబు, ఆసియన్ సునీల్ లాంటి వారు లేక పోవటం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.