లోకనాయకుడు కమల హాసన్ కూతురు గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ అంటే అందరికి ఇష్టమే. వ్యక్తిగతంగా హద్దులు దాటేస్తున్నా..సినిమా ల పరంగా మాత్రం మంచి పేరు సంపాదించుకుంది. సౌత్ ఇండస్ట్రీ లో వరుస విజయాలు సాధించి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ బ్యూటీల లిస్ట్ లో చేరిపోయింది ఈ అమ్మడు.
టాలీవుడ్ బిగ్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఇంకా చాలామంది టాప్ హీరోల సరసన నటించడం..ఆ సినిమాలు హిట్ అవ్వడంతో ఒక్కసారిగా శృతి రేంజ్ పెరిగిపోయింది. సౌత్ లో సక్సెస్ సాధించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుని విజయాలు సాధించి..తండ్రికి తగ్గ కూతురుగా ..శభాస్ అనిపించుకుంది. ప్రజెంట్ శృతి ప్రభాస్ సలార్ సినిమా, బాలయ్య తో ఓ సినిమా, చిరంజీవితో ఓ సినిమా చేస్తుంది.
అయితే తాజాగా సోషల్ మీడియాలో శృతి పై అనే రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. శృతి కి ఆరోగ్యం బాగోలేదని..ప్రజెంట్ హాస్పిటల్ బెడ్ పై చాలా దారుణమైన పోజీషన్ లో ఉందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వార్తలు అల్లేసాయి. ఇలాంటి వాటి పై స్పందిస్తూ శృతి..క్లారిటీ ఇచ్చింది “గత కొన్ని రోజుల నుంచి నాకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాకు ఆరోగ్యం బాగోలేదని, హాస్పిటల్ లో క్రిటికల్ కండీషన్ లో ఉన్నానని వార్తలు వస్తున్నాయి. అవన్ని ఫేక్ న్యూస్ లు. అందులో ఎలాంటి నిజం లేదు. చూడండి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో..నాకు ఉన్న ప్రాబ్లెమ్ అల్లా పీసీఓఎస్.. ఈ మధ్య కాలంలో అందరి మహిళలో చాలా సాధారణమైన విషయం.. ఆ ఒక్క మాటను ఓట్టుకుని కొందరు కావాలనే తప్పదోవ పట్టిస్తున్నారు.. నేను చాలా హెల్తీ గా హ్యాపీగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.