క్రేజ్ ఉన్న బ్యూటీ అయినా కొంతవరకే రింగులో ఉంటుంది. ఒక్కసారి రింగు దాటి బయటకు వచ్చిందా..అంతే, మళ్ళీ అవకాశాలు హీరోయిన్‌గా దక్కించుకోవడం కష్టం. మన సినిమా ఇండస్ట్రీలో మేకర్స్‌కు సెంటిమెంట్స్ బాగా ఎక్కువ. హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అయితే,
వరుసగా క్యూ కడతారు. వయసుతో సంబంధం లేకుండా సీనియర్ హీరోల సరసన కూడా జోడీ కట్టిస్తారు. ఒకవేళ అదే మొదటి సినిమా ఫ్లాపయితే, తొంబై శాతం అవకాశాలు కరువవుతాయి. దీనికి ఉదాహరణగా కూడా ఈ హీరోయిన్స్‌ను చెప్పొచ్చు.
రకుల్ ప్రీత్ సింగ్ ఒకదశలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో నటించడానికి కూడా డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. అంత బిజీగా సినిమాలు చేసింది. అదే రకుల్ నాగార్జున సరసన మన్మధుడు 2 లాంటి సినిమాలు ఒప్పుకోవడం వల్ల ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. ఇక మాస్ మహారాజ
రవితేజ సరసన నటించిన కుర్రభామ మాళవిక శర్మ కూడా అంతే. చెప్పాలంటే ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటున్న యంగ్ బ్యూటీస్ కంటే అన్నీ కోణాలలో బావుంటుంది.
కానీ, మొదటి సినిమా టచ్ చేసి చూడు అట్టర్ ఫ్లాప్. ఆ తర్వాత రామ్ పోతినేని సరసన నటించిన సినిమా రెడ్ సినిమా కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో మళ్ళీ ఇంతవరకు అవకాశాలు దక్కలేదు. ముఖ్యంగా హీరోయిన్స్‌కు కొన్ని లాజిక్స్ చాలా ముఖ్యం. అవి ఫాలో కాకనే అడ్రస్ లేకుండా పోతున్నారు. ఇదే ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కూడా మిస్ అయి ఇప్పుడు అవకాశాల కోసం ఆవురావురంటోంది.
నన్నుదోచుకుందువటే, అదుగో లాంటి సినిమాలను చేసింది. ఇండస్ట్రీ వర్గాలను ఆకట్టుకున్నా కూడా క్రేజీ ఆఫర్ దక్కలేదు. అదే సమయంలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చి ఇస్మార్ట్ బ్యూటీగా సాలీడ్ క్రేజ్ తెచ్చిపెట్టాడు. అయితే ఇక్కడే నభా రాంగ్
స్టెప్స్ వేసింది. వరుసగా అవకాశాలు రావడంతో కథ బావుందా లేదా..ఇది చేస్తే నా కెరీర్‌కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఆలోచించకుండా రెమ్యునరేషన్ బాగా డిమాండ్ చేసి సినిమాలు చేసింది.
నభా అలా రెమ్యునరేషన్ కోసం ఆశపడి చేసిన అన్నీ సినిమాలు ఫ్లాపవడంతో రెండు విధాల దెబ్బపడింది. ఒకవైపు ఫ్లాప్స్ మరొకవైపు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ నభాను తీసి పక్కన పెట్టారు. మరి అమ్మడికి ఈ లాజిక్స్ అన్నీ ఎప్పుడు తెలుస్తాయో మళ్ళీ అవకాశాలు ఎప్పుడు అందుకుంటుందో ? చూడాలి.