ఉలగ నాయగన్ కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ మూడున్నర పదుల వయస్సుకు చేరువ అయినా కూడా క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో బాలయ్య 107వ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా ఉన్నాయి. ఇక ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్టు సలార్‌లో ఆమె ఆద్య అనే పాత్రలో నటిస్తోంది. ఈ వయస్సులో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉండడం అంటే మామూలు విషయం కాదు.
తెలుగులో శృతీ అనగనగా ఒక ధీరుడు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, బలుపు లాంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది. శృతీ ఇప్పటకీ పెళ్లికి దూరంగా ఉన్నా ఎఫైర్లు, డేటింగ్‌లతో మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటోంది. ముందుగా యంగ్ హీరోతో ఆమె ప్రేమలో పడిందన్న పుకార్లు కెరీర్ స్టార్టింగ్‌లో వినిపించాయి.
తర్వాత బ్రిటన్ ప్రియుడితో ఆమె ఏకంగా సహజీవనమే చేసింది. రెండు.. మూడేళ్ల పాటు ఆమె అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఒకే ఇంట్లో కలిసి కాపురం కూడా పెట్టేసింది. ఆ తర్వాత అతడితో బ్రేకప్ అయిపోయింది. ఇక ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోన్న ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు బదులిస్తూ నా దగ్గర దానికి ఆన్సర్ లేదని చమత్కారంగా చెప్పింది.
శృతి ప్రస్తుతం ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతానుతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా మీడియాలో కథలుగా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి తన పెళ్లెప్పుడో తనకు తెలియదని శృతి చెప్పినా శాంతానును తండ్రి కమల్ దగ్గరకు తీసుకు వెళ్లి కూడా పరిచయం చేసిందంటున్నరు. ప్రస్తుతం శృతి చేతిలో ఉన్న సినిమాల తర్వాత ఆమె పెళ్లి గురించి ఓ క్లారిటీ రావొచ్చు..!