Moviesనా హృదయం ముక్కలు చేసేసి వెళ్లిపోయింది.. సంచలన విషయం బయటపెట్టిన నాగచైతన్య..!!

నా హృదయం ముక్కలు చేసేసి వెళ్లిపోయింది.. సంచలన విషయం బయటపెట్టిన నాగచైతన్య..!!

అసలే నెట్టింట ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న నాగ చైతన్య మరో బిగ్ బాంబ్ పేల్చారు. తన ఫస్ట్ లవ్ సమంత కాదని చెప్పకనే చెప్పేశారు. మనకు తెలిసిందే..నాగార్జున డైరెక్టర్ విక్రమ్ దర్శకత్వంలో “ధ్యాంక్యూ” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకునేలా చేసింది. అంతేకాదు, ఈ సినిమాలో నాగచైతన్య యాక్టింగ్ స్టైల్ కొత్తగా ఉంది.


ఈనెల 22న ఈ సినిమా గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి..ప్రమోషన్స్ పనులను స్టార్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రాశీఖన్నా, నాగచైతన్య. సినిమా గురించిన విషయాలను చెప్పుతూనే..తమ పరసనల్ మ్యాటర్స్ చెప్పుతూ సందడి చేశారు. ఈ క్రమంలోనే హోస్ట్ అడిగిన ప్రశ్నకి జవాబు ఇస్తూ..నాగ చైతన్య తన ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అప్ అయ్యాడు. తన ఫస్ట్ లవ్ తొమ్మిదవ తరగతి లో స్టార్ట్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ..” నా ఫస్ట్‌లవ్‌ స్టార్ట్ అయ్యింది తొమ్మిదో తరగతిలో. దాని లవ్ అంటారో లేదో కూడా నాకు తెలియదు. ఆ రోజుల్లో అలా జరిగిపోయింది. మా క్లాస్ లో మేం ముగ్గురం కలిసి ఒకే అమ్మాయిని లవ్‌ చేసేవాళ్లం. అలా ఉన్నింది ఆ రోజుల్లో. అయితే ఆ అమ్మాయి మా ముగ్గురిని కాదని వెళ్లిపోయింది. ఆ రోజు తమ హృదయాలు ముక్కలు అయ్యిన్నత్లు అనిపించింది..’ అంటూ సరదాగా తన పాస్ట్ లవ్ నిగుర్తు చేసుకున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం చైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. సమంత ప్లేస్ నెంబర్ 2 అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు విదాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డ సంగతి తెలిసిందే.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news