టాలీవుడ్ మాజీ భార్య, భర్తలు నాగచైతన్య – సమంత ఇద్దరూ విడాకుల తర్వాత ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. చైతు తెలుగులో ఇప్పటికే నాలుగు వరుస హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అటు అమీర్‌ఖాన్ లాల్‌సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక రేపు థ్యాంక్యు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక సమంత తెలుగులో యశోద, శాకుంతలం సినిమాలతో పాటు బాలీవుడ్లో హాట్ వెబ్‌సీరిస్‌లు, హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తోంది.
అయితే ఇప్పుడు వీరిద్దరు తక్కువ టైంలోనే తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకేసారి వీరు బాలీవుడ్ జనాల మధ్య సందడి చేస్తున్నారు. ఇప్పటికే సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్తో బాలీవుడ్ జనాలను చాలా హాట్‌గా పలకరించేసింది. ఆమె నటించిన యశోద హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.
ఇక హిందీలో తనను తాను ప్రమోట్ చేసుకునే క్రమంలో సమంత బాలీవుడ్లో టాక్ షోలతో హడావిడి చేస్తోంది. ఇక ఇప్పుడు చైతు కూడా తన లాల్‌సింగ్ చద్దా ప్రమోషన్లలో బాలీవుడ్లో బిజీగా ఉన్నాడు. హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా లాల్‌సింగ్ చద్దా తెరకెక్కింది. ఇందులో నాగచైతన్య ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ సినిమాలో కీలకమైన సైనికుడి పాత్రలో చైతు నటిస్తున్నాడు.
ఈ పాత్ర కొద్ది సేపు మాత్రమే ఉంటుందట. అయితే చైతు మాత్రం ప్రమోషన్లలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నాడు. తనకు బాలీవుడ్ ఫస్ట్ సినిమాలో మంచి అప్లాజ్ వచ్చే క్రమంలోనే చైతు మామూలుగా కష్టపడడం లేదు. ఇటు సమంత కూడా బాలీవుడ్ ఫ్యాన్స్‌కు మరింతగా ఎట్రాక్ట్ అయ్యేందుకు స్పీడ్‌గా ఉంది. ఏదేమైనా ఈ మాజీ భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకేసారి ముంబైలో మకాం వేసి ప్రమోషన్ల పోరులో పోటీ పడుతున్నారు.