సాయి పల్లవి..ఓ లేడీ సూపర్ స్టార్. తన దైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..ఎక్స్ పోజింగ్ కి దూరంగా..నటనకు దగ్గరగా ఉండే పాత్రలు చూస్ చేసుకుంటూ..ఫైనల్లీ..తాను అనుకున్న స్దానానికి చేరుకున్న సాయి పల్లవి అంటే ఇండస్ట్రీలో అందరికి ఓ ప్రత్యేకమైన గౌరవం. ఇప్పుడున్న హీరోయిన్స్ లో సాయి పల్లవి లాంటి వారు లేరు అంటూ ఆమె ఇండస్ట్రీకి దొరికిన వజ్రం అంటూ డైరెక్టర్లు సైతం పొగిడేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ అయితే..స్టేజీ పైనే ఓపెన్ గా ..”నీకు పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క్రేజ్ ఉంది. నువ్వు లేడీ పవన్ కల్యాణ్ ” అంటూ స్టన్నింగ్ కామెంట్స్ చేశారు. ఇక అప్పటి నుండి సాయి పల్లవిని అందరు లేడీ పవర్ స్టార్ అంటూ పొగిడేస్తున్నారు. ఏ ఇంటర్వ్యుకి వెళ్లినా ఆమెకు అదే పిలుపు ఎదురవుతుంది.
కాగా, రీసెంగా విరాట పర్వం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి. ప్రజెంట్ మూడు సినిమాలకు కమిట్ అయ్యిన్నట్ళు తెలుస్తుంది. వాటిల్లో ఒకటి ‘గార్గి’. సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గార్గి’. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. కాలి వెంకట్, శరవణన్ కీలక పాత్రధారులు. ఈ సినిమా కోసం ఫస్ట్ టైం ఆమె కోర్టు మెట్లు ఎక్కింది.
సినిమాలో న్యాయం కోసం ఆమె కోర్టు మెట్లు ఎక్కిన్నత్లు తెలుస్తుంది. కాగా, 2డీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక సమర్పిస్తున్నారు. రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్ జార్జి, గౌతమ్ రామచంద్రన్ నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 15న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.