సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ గ్లామరస్ హీరోయిన్‌కు లేని క్రేజ్, ఫాలోయింగ్ ఆమెకు ఉంది. ఇందుకు కారణం ఆమె చేసిన పాత్రలే. ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు.. పోషించిన పాత్రలు చూస్తుంటేనే ఆమెలో ఎంత నటన దాగిఉందో తెలుస్తోంది. పారితోషకం విషయంలో సాయిపల్లవికి పెద్ద పట్టింపు ఉండదు.
పాత్రలో దమ్ము లేకపోతే సాయిపల్లవికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా నటించడానికి అయితే ఇష్టం ఉండదు. అందుకే ఆమె అంటే తెలుగులో కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌లోనూ ఎంతో గౌరవం పెరిగింది. సాయిపల్లవి ఓ సినిమా చేయడానికి ఒప్పుకుందంటే కథలో ఖచ్చితంగా ఏదో కొత్తదనం ఉందనే ఫిక్స్ అయిపోతున్నారు. తెలుగులో చాలా మంది సినీ లవర్స్ సాయిపల్లవిని తమ ఫ్యామిలీ మెంబర్‌గా కూడా చూస్తున్నారంటే ఆమె క్రేజ్ అర్థమవుతోంది.
తాజాగా ఆమె విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె పోషించిన నక్సెలైట్ సరళపాత్రలో అలా ఒదిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె టాలీవుడ్లో తన బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ రానా – చైతు ఇద్దరూ కూడా తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని.. వాళ్లిద్దరు కూడా తనను కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని.. నా విషయంలో చాలా కేర్ తీసుకుంటారని చెప్పుకువచ్చింది.
సాయిపల్లవి చైతుతో లవ్‌స్టోరీ, రానాతో విరాటపర్వం సినిమాలు చేసింది. నటనా పరంగా చూసుకుంటే సాయిపల్లవి చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే..! ఇక ఇప్పుడు ఆమె కోలీవుడ్‌లో గార్గి అనే సినిమా చేస్తోంది. స్టార్ హీరో సూర్య కూడా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. సమాజంలో ఆడపిల్లలకు ఎదురవుతోన్న అన్యాయాలు, అక్రమాలపై పోరాటం చేసే అమ్మాయిగా సాయిపల్లవి కనిపిస్తోంది.