యువతకు ఎక్కువగా ఇష్టమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో భువనేశ్వరి కూడా ఒకరు. పిల్లికల్లతో కసి చూపులు చూడటం …హస్కీ వాయిస్ తో మత్తెక్కించడంతో ఆమెకు పడిపోయిన అభిమానులు ఎక్కువ మందే ఉన్నారు. అంతే కాకుండా చూడ్డానికి ఎత్తు, పొడవుగా ఉండటంతో ఈమెను ఎక్కువగా యువతే అభిమానించేవారు. భువనేశ్వరికి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. నిజానికి భువనేశ్వరి పుట్టింది ఏపీలో… కానీ పెరిగింది మొత్తం తమిళనాడులోనే..!
ఆమె ఫ్యామిలీ విశాఖ జిల్లా మాడుగులలో స్థిరపడింది. ఆమె ఇద్దరు సోదరులు రాజకీయాల్లో ఉన్నారు. ఓ సోదరుడు రామానాయుడు టీడీపీ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.
చదువులో చురుకుగా ఉండే భువనేశ్వరి సినిమాల్లో నటించాలని కలలు కనేది. కాలేజీలోనే హీరోయిన్ లాంటి ఫిజిక్ ఉండటంతో ఫ్రెండ్స్ అంతా సినిమాల్లో ట్రై చేయాలని బ్యూటీకి సలహాలు ఇచ్చారు. దాంతో 21 ఏళ్ల వయసులో చెన్నై కి వెళ్ళిపోయింది. కానీ భువనేశ్వరి సినిమాల్లో ప్రయత్నాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సరైన వ్యక్తులు ఆమెకు తగల్లేదు. అంతా ఆమె అందాన్ని ఆశ్వాదించాలనుకునేవారే ఎదురయ్యారు. దర్శక నిర్మాతలే కాకుండా నటులు సైతం ఆమె అందాన్ని చూసి ఆమెను వాడుకోవాలని చూశారు. దాంతో సినిమాల్లో నటించకుండానే భువనేశ్వరి భారీగా డబ్బులు సంపాదించింది.
అలాంటి టైమ్ లోనే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇదిలా ఉండగా అలాంటి సమయంలోనే ఓ నిర్మాత భువనేశ్వరి జీవితంలోకి ప్రవేశించాడు. ఆమె అందాన్ని పొగడ్తలతో ముంచెత్తి ఆమెకు సినిమాల్లో కొన్ని ఛాన్స్ లను ఇప్పించాడు. కానీ భువనేశ్వరి గ్లామర్ చూసి అప్పటి వాళ్లు ఎక్కువగా వ్యాంప్ పాత్రలనే ఇచ్చారు. భాయ్స్ సినిమాలో కూడా వ్యభిచారిని పాత్రలో నటించి భువనేశ్వరి అభిమానులను అలరించింది. ఆ తరవాత ఆమెకు అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి.
అయితే తెలుగులో మాత్రం ఆమెకు కాస్త నటనకు స్కోప్ ఉన్న పాత్రలు వచ్చాయి. తెలుగులో కామెడీతో కూడిన వ్యాంప్ పాత్రలు రావడంతో భువనేశ్వరి క్రేజ్ పెరిగిపోయింది. కెరీర్ సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో ఆమెకు ఆఫర్ లు ఇప్పించిన నిర్మాత కూడా మధ్యలోనే వదిలేశాడు. 2002లో చెన్నైలోని టి నగర్ లో భువనేశ్వరి ఓ పొలిటిషయన్‌తో కలిసి ఉండగా పోలీసులు మీడియా పట్టుకున్నారు. ఆ తరవాత మీడియాలో భువనేశ్వరి పేరు మారుమోగిపోయింది.
పొలిటికల్ సపోర్ట్ తో ఆ కేసు నుండి బయటపడిపోయింది. ఆ తరవాత తమిళనాట పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఎమ్మెల్యేల తరుపున ఎన్నికల్లో ప్రచారం కూడా చేసింది. ఆ సమయంలో రాష్ట్రాన్నే భువనేశ్వరి ఊపేసింది. ఇక అప్పట్లో భువనేశ్వరి ఇంటి ముందు ఎన్నో కార్లు ఆగేవని తమిళనాట మీడియాలో ప్రచారం జరిగింది. అంతే కాకుండా 2009లో భువనేశ్వరి వ్యభిచార ఆరోపణలతో మరోసారి పట్టుబడింది. ఇక గత ఎన్నికలకు ముందు ఆమె ఏపీలో వైసీపీకి సపోర్ట్ చేసింది.