Moviesఆ స్టార్ హీరో భార్య‌తో ర‌విశాస్త్రి పీక‌ల్లోతు ప్రేమ‌.. ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత...

ఆ స్టార్ హీరో భార్య‌తో ర‌విశాస్త్రి పీక‌ల్లోతు ప్రేమ‌.. ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత బ్రేక‌ప్‌.. ఎన్ని మ‌లుపులో…!

మాజీ స్టార్ క్రికెట‌ర్‌, కోచ్ ర‌విశాస్త్రి భార‌త క్రికెట్‌లో ఎన్నోసార్లు కీల‌క‌పాత్ర పోషించారు. ఒక ఆట‌గాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా ర‌విశాస్త్రి ప్ర‌యాణం ఎప్పుడూ వైవిధ్యంగానే ఉంటుంది. అలాంటి ర‌విశాస్త్రి ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో చేసిన ప్రేమాయ‌ణం.. వీరి తిరుగుళ్లు, ఎంగేజ్‌మెంట్‌, బ్రేక‌ప్ అన్నీ కూడా అప్ప‌ట్లో మీడియాలో హాట్ టాపిక్‌. బాలీవుడ్ హీరోయిన్లు, ఇండియ‌న్ క్రికెట‌ర్ల మ‌ధ్య ప్రేమ‌లు, పెళ్లిళ్లు, బ్రేక‌ప్‌లు అనేవి కామ‌న్‌గా ఉండేవి.

ఈ లిస్టులోనే అప్పుడు అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా ఉన్న ర‌విశాస్త్రి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమృతాసింగ్ స్టోరీ కూడా ఉంది. అమృతాసింగ్ త‌ల్లికి అప్ప‌ట్లోనే సంజ‌య్‌గాంధీతో సంబంధాలు ఉండేవ‌న్న టాక్ ఉంది. ఇక అమృతాసింగ్ స్టార్ హీరోయిన్‌గా ఉన్న‌ప్పుడు ర‌విశాస్త్రితో ప్రేమ‌లో ప‌డింది. ఎక్క‌డ చూసినా ఈ జంటే చెట్టాప‌ట్టాలు వేసుకుని క‌నిపించేవారు. వీరు ప‌బ్లిక్‌గానే ఎన్నోసార్లు తాము ప్రేమ‌లో ఉన్నామ‌ని ఒప్పుకున్నారు.

ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల‌పై కూడా వీరి ఫొటోలు వ‌చ్చేవి. వీరి ప్రేమ గురించి చిన్న వార్త వ‌చ్చినా అప్పుడు బాలీవుడ్‌, నేష‌న‌ల్ మీడియాకు అదో హాట్ కేకు. అయితే ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింది. ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత ర‌విశాస్త్రి కుటుంబం నుంచి కొన్ని కండీష‌న్లు. అవి అమృత‌కు న‌చ్చ‌లేదు. ర‌విశాస్త్రి మంగ‌ళూరుకు చెందిన బ్రాహ్మ‌ణ కుటుంబంలో పుట్టాడు. వీళ్ల‌కు ఆచారాలు ఎక్కువే.

పెళ్లి త‌ర్వాత కోడ‌లు న‌టించ‌కూడ‌దు అన్న‌దే ర‌విశాస్త్రి వాళ్ల ఫ్యామిలీ కండీష‌న్‌. అది అమృత‌కు న‌చ్చ‌లేదు. ఇటు ర‌విశాస్త్రి కూడా పెళ్లి త‌ర్వాత నా భార్య ఇంటి ప‌ట్టునే ఉండి ఫ్యామిలీ లైఫ్‌కు ప్ర‌యార్టీ ఇవ్వాల‌ని కోరుకున్నాడు. కుద‌ర్లేదు.. ఎంగేజ్‌మెంట్ వ‌ద్దే పెళ్లి ఆగిపోయింది. అమృత‌తో విడిపోయాక ర‌వివాస్త్రి 1990లో రీతూసింగ్‌ను పెళ్లాడాడు. ఆ త‌ర్వాత 1992లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

ఇక ఆ మ‌రుస‌టి యేడాదే అమృతాసింగ్ వ‌య‌స్సులో త‌న కంటే చాలా చిన్నోడు అయిన న‌వాబుల వంశానికి చెందిన హీరో సైప్ ఆలీఖాన్‌ను పెళ్లాడింది. ఆ త‌ర్వాత అమృత‌కు ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక ( సారా ఆలీఖాన్ కూడా వీరి కుమార్తే) విడాకులు ఇచ్చిన సైఫ్ త‌న కంటే చాలా చిన్న‌ది అయిన క‌రీనా క‌పూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంప‌తుల‌కు తైమూర్ అనే కొడుకు ఉన్నాడు. రీనాను పెళ్లి చేసుకున్నాక కూడా ర‌విశాస్త్రి మ‌రో బాలీవుడ్ హీరోయిన్ నిమ్ర‌త్ కౌర్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news