సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏది నిజమో ఏది అబ్బధమో తెలుసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి. దానిలో అన్ని నిజాలు ఉన్నాయా అంటే అవునని చెప్పలేం. అలా అని అన్ని ఫేక్ న్యూస్ లా అంటే అది కూడా చెప్పలేం. ఎందుకంటే, సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు నిజం చేశారు మన సెలబ్రిటీలు.
స్టార్ హీరోయిన్ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అని వాళ్ళు విడాకులు ప్రకటించే ఆరు నెలల ముందు నుండే సామాజిక మాధ్యమాలల్లో వార్తలు వినిపించాయి. ఫైనల్లీ అదే నిజం అయ్యింది. ఇక స్టార్ హీరోయిన్ కాజల్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ కాజల్ ఆ వార్తలను ఖండిస్తూ వచ్చినా..ఫైనల్ గా గర్భవతిని అంటూ ఓపెన్ అప్ అయ్యింది.
అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. స్టార్ హీరో రానా..పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. బాహుబలిలో వీళ్ళ నటనకి ప్రపంచ దేశాలు ఫిదా అయ్యాయి. అయితే, రానా గతంలో హీరోయిన్ త్రిష తో లవ్ ఎఫైr ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
అలాగే, ప్రభాస్ కి కూడా త్రిష తో లవ్ ట్రాక్ నడించిందని..వర్షం సినిమా టైం నుండే.. వీళ్ల లవ్ మొదలైందని ..ఆ తరువాత బుజ్జిగాడు, పౌర్ణమి సినిమాలతో ఆ లవ్ స్ట్రాంగ్ అయ్యిందని వార్తలు వినిపించాయి. కానీ, ఇద్దరు అమ్మడి ని పెళ్లి చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూయించలేదు. రానా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోగా..త్రిష నిశ్చితార్ధం చేసుకుని, క్యాన్సిల్ చేసుకున్నింది . ప్రభాస్ మాత్రం సింగిల్ గానే కాలం గడుపుతున్నాడు.