రమ్యకృష్ణ నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. టాలీవుడ్‌లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రమ్య దాదాపు 40 సంవత్సరాలుగా హీరోయిన్‌గా, ఇప్పుడు టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన నటనను కంటిన్యూ చేస్తూనే ఉంది. తెలుగుతో పాటు తమిళంలో రెండున్నర దశాబ్దాల క్రిందట రమ్యకృష్ణ అంటే ఓ క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలు అందరి పక్కన నటించిన రమ్య రజనీకాంత్ లాంటి క్రేజీ హీరోకే పోటీ ఇచ్చే పాత్రల్లో నటించి మెప్పించింది. రౌద్రం, ప్రేమ, లేడీ విలనిజం ఇలా ఏదీ చూపించాలన్నా రమ్య మాత్రమే హీరోలకు పోటీగా నటించేది.
హీరోయిన్‌గా రమ్యకృష్ణ కెరీర్ అయిపోయాక ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి తన నట విశ్వరూపంతో దూసుకుపోతోంది. ఇప్పుడు సౌత్‌లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్‌లో రమ్య ఉంది. అసలు బాహుబలి సినిమాలో శివగామీ దేవి పాత్ర చూశాక.. ఆ పాత్రకు ఇండియాలో ఏ నటిమణి అయినా సరితూగుతారా ? అసలు రమ్యను తప్ప ఆ పాత్రలో మరో నటిమణిని ఊహించుకోగలమా ? అన్నంత విశ్వరూపంతో నటించింది. ఈ విషయాన్ని రాజమౌళీయే స్వయంగా ఒప్పుకున్నారు.
బాహుబలి తర్వాత రమ్య రేంజ్ మాత్రమే కాదు.. రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగింది. రమ్య అడక్క పోయినా మేకర్సే పోటీపడి మరీ ఆమె రెమ్యునరేషన్ పెంచేశారు. ప్రస్తుతం రమ్యకృష్ణ రోజు కాల్షీట్‌కు కనిష్టంగా రు. 7 లక్షల నుంచి గరిష్టంగా రు. 10 లక్షల వరకు వసూలు చేస్తోందట. చిన్న హీరోల సినిమాలు అయితే ఆమె రు. 7 లక్షల వరకు రోజు కాల్షీట్‌కు చార్జ్ చేస్తోందట.
అదే పెద్ద సినిమాలు, బ్యానర్లు, పెద్ద హీరోల సినిమాల్లో నటించాలంటే ఆమెకు రోజుకు రు. 10 లక్షల వరకు గిట్టు బాటు అవుతుందట. ప్రస్తుతం ఆమె తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా ఖాళీ లేకుండా నటిస్తున్నారు. ఆమె భర్త చాలా రోజుల తర్వాత దర్శకత్వం వహిస్తోన్న రంగమార్తాండ సినిమాలో సైతం రమ్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు.