సీనియర్ నటుడు ప్రతాప్ పోతేన్ (70) శుక్రవారం ఉదయం మృతిచెందారు. ఆయన చెన్నైలోని తన నివాసంలో కార్డియాక్ ఆరెస్టులో మృతిచెందారు. మళయాళ చిత్ర పరిశ్రమలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన 100కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన సినిమాల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
ప్రతాప్ పోతన్ సీనియర్ నటి రాధికకు మొదటి భర్త. రాధిక కెరీర్‌లో ఫాంలో ఉండగానే ప్రతాప్ పోతన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే మనస్పర్థల నేపథ్యంలో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రాధిక ఓ బ్రిటీన్ ఇండియన్‌ను పెళ్లి చేసుకుని అతడికి కూడా విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె సీనియర్ నటుడు శరత్ కుమార్‌ను మూడో పెళ్లి చేసుకుంది.
ఇక ప్రతాప్ పోతన్ విషయానికి వస్తే ఆయన కేరళకు చెందిన వారు. కులతుంకల్ పొతెన్, పొన్నమ్మ పోతెన్ లకు తిరువనంతపురంలో ఆగస్టు 13, 1952 న జన్మించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, స్క్రిఫ్ట్ రైటర్, డైరెక్టర్, యాడ్ ఫిల్మ్ మేకర్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు.
ప్రతాప్ పోతన్ మళయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలతో పాటు యాడ్ ఫిల్మ్ మేకర్‌గా తనదైన ముద్ర వేశారు. అయితే రాధికతో ఆయన బంధం అనేక గొడవలకు కారణమైంది. పెళ్లయ్యాక రెండేళ్లకే వీరు విడిపోయారు. రాధికతో విడాకులు అయిపోయాక ప్రతాప్ పోతన్ మీడియాను పిలిచి మరీ ఆమె మంచిది కాదని చెప్పారు. రాధిక మాత్రం ఎప్పుడూ ప్రతాప్ గురించి తప్పుగా మాట్లాడలేదు.