Moviesబోల్డ్ ' రాధికా ఆఫ్టే ' ప్రేమ పెళ్లి స్టోరీ ఇదే......

బోల్డ్ ‘ రాధికా ఆఫ్టే ‘ ప్రేమ పెళ్లి స్టోరీ ఇదే… భ‌ర్త‌కు అందుకే దూర‌మైందా..!

రాధికా ఆఫ్టే ప్ర‌త్యేకంగా ఈ పేరు గురించి పరిచ‌యం అక్క‌ర్లేదు. వ‌ర్మ డిస్క‌వ‌రీ ర‌క్త‌చ‌రిత్ర గాళ్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. తొలి సినిమా టైంలో ఆమె చాలా ఇన్నోసెంట్ అనుకున్నారు. ఆ త‌ర్వాత ఆమెలోని బోల్డ్ విశ్వ‌రూపాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు చూపించింది. బాలీవుడ్‌లోనూ మ‌రీ బోల్డ్ పాత్ర‌ల‌తో కావాల్సినంత ర‌చ్చ క్రియేట్ చేసింది. మ‌రీ పెద్ద సూప‌ర్ హిట్ సినిమాలు చేయక‌పోయినా రాధికా అంటే ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అవ్వ‌డానికి ఆమె హాట్ అంద‌చందాలు ఆర‌బోయ‌డం.. బోల్డ్ పాత్ర‌లు, బోల్డ్ కామెంట్సే కార‌ణం.

తెలుగులో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు జోడీగా లెజెండ్‌, ల‌య‌న్ సినిమాలు వ‌రుస‌గా చేసింది. అయినా తెలుగులో ఆ త‌ర్వాత అంత పెద్ద అవ‌కాశాలు ద‌క్కించుకోలేకపోయింది. ప్ర‌స్తుతం ఈ భామ బాలీవుడ్‌లో మోనికా – ఓ మై డార్లింగ్ సినిమాల్లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్ సంస్థ కూడా బోల్డ్ కంటెంట్ వెబ్‌సీరిస్‌ల‌కు ఇప్పుడు రాధికా బోల్డ్ యాక్టింగే పెద్ద స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌.

ఇక ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే ఆమె ప‌దేళ్ల క్రింద‌టే బ్రిట‌న్‌కు చెందిన బెన‌డిక్ట్ టేల‌ర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. త‌న భ‌ర్త విదేశాల్లో ఉంటాడ‌ని.. తాము అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే క‌లుసుకుంటామ‌ని కూడా ఓపెన్‌గానే చెప్పేది. ఎవ‌రి కెరీర్ ప‌రంగా వారు బిజీగా ఉండ‌డంతో తాను ఇక్క‌డ ఉంటుంటే.. త‌న భ‌ర్త విదేశాల్లో ఉంటాడ‌ని ఆమె చెప్పేది. అయితే ఈ ప‌దేళ్ల‌లో రాధిక త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉన్న ఫొటోలు కూడా బ‌య‌ట‌కు రాలేదు. 2012లో రాధిక – బెన‌డిక్ట్ టేల‌ర్ పెళ్లి జ‌రిగింది.

క‌నీసం ఇంట‌ర్నెట్‌లో కూడా త‌మ ఫొటోలు లేక‌పోవ‌డానికి తాను ఫొటోలు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం.. త‌న భ‌ర్త‌కు కూడా ఫొటోల‌పై ఆస‌క్తి లేక‌పోవ‌డ‌మే అని చెప్పింది. ఉత్త‌ర ఇంగ్లాండ్‌లో త‌మ‌ పెళ్లి జ‌రిగిన‌ప్పుడు కూడా స్నేహితులు తీసిన ఒక‌టి రెండు ఫొటోలు మిన‌హా పెద్ద‌గా లేవ‌ని చెప్పింది. ఇక ఈ బోల్డ్ భామ ప్రేమ విష‌యానికి వ‌స్తే యేడాది పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2011లో రాధిక కాంటెంప‌ర‌రీ డ్యాన్స్ నేర్చుకునే క్ర‌మంలో లండ‌న్‌లో ఉన్న టైంలోనే బెన‌డిక్ట్‌తో ప్రేమ‌లో ప‌డింది.

2012లో వీరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నా.. 2013లో ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పారు. ఇక రాధిక సినిమాల విష‌యానికి వ‌స్తే విక్రాంత్ మాస్సేతో క‌లిసి ఫోరెన్సిక్‌లో ఇటీవ‌ల న‌టించింది. ఇక హృతిక్ రోష‌న్ – సైప్ ఆలీఖాన్ న‌టిస్తోన్న విక్ర‌మ్ వేద‌లో కూడా క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news