టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎప్పుడు లేనంత ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు అసలు ప్లాప్ అన్నదే లేదు. తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో తొలి పాన్ ఇండియా హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఈ తరం స్టార్ హీరోలు ఎవరికీ సాధ్యం కానీ విధంగా డబుల్ హ్యాట్రిక్ హిట్ కూడా కొట్టేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస పెట్టి క్రేజీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఎన్టీఆర్… ఆ వెంటనే ప్రశాంత్ దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియా సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ కెరీర్లో మంచి కథలతో సినిమాలు చేసినా.. కూడా ప్రేక్షకులకు రీచ్ కానీ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో రామయ్య వస్తావయ్య – ఊసరవెల్లి ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు సినిమాలు మంచి కథా బలంతో తెరకెక్కిన ప్రేక్షకులకు ఎందుకో కానీ సరిగా రీచ్ కాలేదు. రామయ్యా వస్తావయ్యా సినిమాను దిల్ రాజు నిర్మించారు. బృందావనం హిట్ అయ్యాక హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.
అయితే ఈ సినిమాకు ముందు అనుకున్న కథ వేరట. ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా.. అప్పుడే కరెక్టుగా ప్రభాస్ రెబల్ సినిమా రిలీజ్ అయ్యింది అట. తండ్రికి జరిగిన అన్యాయం కోసం రివేంజ్ తీర్చుకునే స్టోరీలాగా ముందు అనుకున్న కథ ఉండడంతో ఆ కథను పక్కన పెట్టేసి.. అప్పుడు హరీష్ చెప్పిన మరో రివేంజ్ డ్రామాతో ఈ సినిమా తీశారట. ఈ సినిమా కథా పరంగా బాగున్నా ఎక్కడో తేడా కొట్టడంతో ప్లాప్ అయ్యింది.
దీనిపై తర్వాత ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. తండ్రికి జరిగిన అన్యాయం అన్నది రెబల్లోనూ తాము ముందు అనుకున్న కథలోనూ ఎక్కడో సిమిలారిటీగా ఉందని.. అదే కథతో సినిమా తీస్తే రిలీజ్ అయ్యాక సేమ్ రెబల్‌లా ఉందని అంటారన్న డౌట్‌తోనే తాము కథను మార్చి రామయ్యా వస్తావయ్యా తీశామని.. అది ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేదని చెప్పారు.
అలా ప్రభాస్ సినిమా కోసం ఎన్టీఆర్ సినిమాకు కథ మార్చినా వర్కవుట్ కాలేదు. విచిత్రం ఏంటంటే రెబల్ కూడా ఓవర్ కాస్ట్‌తో ఫెయిల్యూర్ అయ్యింది. రామయ్యా వస్తావమయ్యా సినిమా ఫస్టాఫ్ బాగుందని టాక్ వచ్చినా.. సెకండాఫ్‌లో ఎక్కడో తేడా కొట్టేయడంతో నిరాశా ఫలితం వచ్చింది.