రెండు దశాబ్దాలకు క్రితం కహోనా ప్యార్ హై ( ప్రియురాలు పిలిచింది) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్. ఆమె తొలి సినిమాతోనే దేశం మొత్తం ఫిదా అయిపోయారు. ఆ తర్వాత అమీషా పటేల్ నూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హిట్ సినిమా బద్రిలో తీసుకున్నారు పూరి జగన్నాథ్. ముంబై వెళ్లి టెస్టులు చేసి మరి అమీషా పటేల్‌ను పవన్ పక్కన హీరోయిన్‌గా సెట్ చేశారు. తెలుగులో పవన్ పక్కన కూడా అమీషా చేసిన నటనకు, ఆమె అంద చందాలకు తెలుగు యువత పిచ్చెక్కిపోయారు.
ఆ తర్వాత అమె సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాని సినిమాలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమాలో కూడా నటించింది. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూనే బద్రితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అమీషా ఆ తర్వాత వరుసగా మహేష్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నా.. ఆ రెండు సినిమాలు సరిగా ఆడక పోవడంతో తెలుగులో అనుకున్నంత స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. ప్రస్తుతం అమీషా వయసు 45 సంవత్సరాల పైనే..
ఈ వయసులోనూ తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తున్న అమీషా పెళ్లికి మాత్రం దూరంగానే ఉంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. వీలున్నప్పుడల్లా మోడలింగ్ చేసుకుంటున్న అమీషా సహనిర్మాతగా చిన్న చిన్న సినిమాలు చేస్తోంది. 45 సంవత్సరాలు దాటుతున్నా అమె పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఆమె నడిపిన ఎఫైర్లే కారణం అన్న గుసగుసలు కూడా ఉన్నాయి. అమె కెరియర్ ప్రారంభంలోనే తన తొలి సినిమా హీరో హృతిక్ రోషన్‌తో ప్రేమలో పడిందని అంటారు. వీరిద్దరూ కలిసి కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు.
ఆ తర్వాత హృతిక్ రోషన్‌కు తన చిన్ననాటి స్నేహితురాలు సుసానే ఖాన్ తో పెళ్లయిపోవడంతో వీరిద్దరూ విడిపోయారు. హృతిక్ రోషన్‌కు దూరం జరిగాక అమీషా బాలీవుడ్ బడా డైరక్టర్ తో ఎఫైర్ పెట్టుకుంది. ఆ బాలీవుడ్ బడా డైరక్టర్ ను పెళ్లి చేసుకుంటుందని.. అందరు అనుకుంటున్న సమయంలో వీళ్లిద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. అలా అమీషా రెండో ప్రేమాయణం కూడ విపలమైంది.
ఇక 40 ఏళ్లు వచ్చాక ముంబాయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో కొన్నాళ్లు ప్రేమాయణం జరిపింది. ఎక్కడ చూసిన వీళ్ళిద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. ఆ బిజినెస్‌మాన్‌కు కూడా అమీషా దూరం అయిపోయింది. ఇప్పుడు ఇంత వయసు వచ్చినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఓ వైపు వయసు పైబడున్నా… ముసలి చాయలు కనుబడతున్నా.. సోషల్ మీడియలో మత్రం హాట్‌గా దర్శనం ఇచ్చేందుకే తాపత్రయపడుతూ ఉంటుంది.