టాలీవుడ్‌లో క్రేజీ హీరోలుగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్‌స్టార్ మహేష్‌బాబు మధ్య 1999లో అదిరిపోయే బాక్సాఫీస్ ఫైట్ జరిగింది. ఈ ఫైట్ ఏయే సినిమాల మధ్య జరిగింది ? ఎవరు పై చేయి సాధించారో ? చూద్దాం. ముందుగా తమ్ముడు సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1999 జులై 17 న వచ్చాడు. ఈ సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే సినిమా మొదటి భాగం అంతా హీరో కేర్ లెస్ గా తిరుగుతూ ఫ్రెండ్స్ తో కాలక్షేపాలు చేస్తూ… ఎగ్జామ్స లో ఫెయిల్ అవ్వటం ఉంటుంది. గొడవలు… హీరో తనను ప్రేమించిన అమ్మాయి మనసు తెలుసుకోకుండా… ఇంకో అమ్మాయి కోసం పరుగులు తీయటాలు… ఇలా గాలికి తిరగటం వంటి క్యారెక్టర్ లో హీరో పవన్ కళ్యాణ్ మొదటి భాగం అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసాడు.
సెకండాఫ్‌లో తన అన్నకు జరిగిన ప్రమాదంతో.. తన అన్న ఆశయం అయిన కిక్ బాక్సింగ్ లో తాను ఎలా ? గెలిచాడు.. తన తండ్రి మెప్పును ఎలా పొందాడు.. తన స్నేహితురాలు ప్రేమని ఎలా గెలిపించాడు అన్నది సినిమా. ఈ సినిమా దర్శకుడు పీఏ. అరుణ్ ప్రసాద్. మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల పాటలు యూత్ ను చాలా ఎంటర్టైన్మెంట్ చేశాయి. చింతపల్లి రమణ డైలాగ్స్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజమ్‌కు తగినట్టుగా రాసిన విధానం అద్భుతం. హీరోయిన్లుగా ప్రీతి జింగానియా -అతిధి గోవిత్రికర్ నటించారు.
అదే సమయంలో మహేష్ బాబుడు రాజకుమారుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరోగా మహేష్‌కు ఇదే తొలి సినిమా. రాజకుమారుడు స్టోరీ పరంగా చూస్తే అమ్మలోని ప్రేమనీ.. నాన్నలోని ప్రేమను తలపోసి పంచిన మామయ్య కోసం… తనను ప్రేమించిన అమ్మాయిని సైతం వదులుకుంటాడు హీరో. తర్వాత తను మావయ్య చెప్పిన లక్ష్యం కూడా తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అని తెలిసి… తన మామయ్యకు ఇచ్చిన మాటను నిలబెట్టి.. తన తండ్రిని చంపిన భూస్వాముల గుండెల్లో ఎలా ? నిద్రపోయాడా అన్నదే కథ.
ఈ సినిమాను ఆద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఈ సినిమాతోనే తననట విశ్వరూపం చూపించాడు మహేష్. తొలి సినిమాతోనే సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని మహేష్ ఆ లెవల్లో పునికి పుచ్చుకున్నాడు. ఈ సినిమాకి మణిశర్మ పాటలు చాలా హైప్ తీసుకొచ్చాయి. ఇక సినిమా బిజిఎం అదిరిపోయింది. హీరోయిన్ ప్రీతి జింటా అందాల భామతో మహేష్ బాబుని చూడడానికి రెండు కళ్ళు చాలావు అన్నట్టుగా చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై చలసాని అశ్వినీ దత్ నిర్మించారు. 1999 జులై 30న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
ఈ రెండు సినిమాల రికార్డులు ఇలా ఉన్నాయి…
– తమ్ముడు డైరెక్టుగా 56 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది.
– రాజకుమారుడు 66 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది
– రాజకుమారుడు 33 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
– తమ్ముడు విజయవాడ యువరాజ్ థియేటర్లో 175 రోజులు ఆడింది.
– రాజకుమారుడు 186 రోజులు రెండు థియేటర్లలో ఆడింది. గుంటూరు బాల భాస్కర్ – విజయవాడ అలంకార్ థియేటర్లో ఈ ఫీట్ నమోదు చేసింది.
– నైజాం కలెక్షన్లలో తమ్ముడు తొలి వారంలో రు. 78 లక్షలు కలెక్ట్ చేసింది.
– రాజకుమారుడు రెండు వారాలకు కలిపి రు. 78 లక్షలు రాబట్టింది.
– తమ్ముడు టోటల్ షేర్ 9.4 కోట్లు రాబట్టింది
– రాజకుమారుడు టోటల్ గా 10.5 కోట్ల షేర్ కొల్లగొట్టింది.
ఓవరాల్ గా ఈ రెండు సినిమాల్లో మహేష్‌బాబు రాజకుమారుడు పైచేయి సాధించింది.