సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ టైం తక్కువుగా ఉంటుంది. హీరోలు 60 – 70 ఏళ్లు వచ్చినా స్టార్ హీరోలుగానే కొనసాగుతూ ఉంటారు. అదే హీరోయిన్లకు గట్టిగా 10 ఏళ్లు మాత్రమే లైఫ్ ఉంటుంది. వాళ్లు ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత స్టార్‌డమ్ ఎంజాయ్ చేసినా.. ఎంత సంపాదించుకున్నా ఈ టైంలోనే చేయాలి. హీరోయిన్ల వయస్సు 35 ఏళ్లు దాటితే వాళ్లకు హీరోయిన్ ఛాన్సులు రావడం కష్టమే. ఎవరో ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలిన హీరోయిన్లు 30 +కే చాపచుట్టేస్తూ ఉంటారు.
అయితే కొందరు హీరోయిన్లు కెరీర్ స్టార్టింగ్‌లో సినిమాలు చేసి.. పెళ్లయ్యాక వ్యాపార రంగంలోకి వెళ్లి సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొందరు హీరోయిన్‌గా కెరీర్ మానేశాక ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుని టాప్ ప్లేసులోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అందులోనూ కొందరు హీరోయిన్లు సినిమాలు మానేసి ఉన్నత చదువులు చదివి.. వరల్డ్ బెస్ట్ ఆర్గనైజేషన్స్‌లో ఉద్యోగాలు చేసే స్తాయికి వెళ్లారు. అలా వెళ్లిన హీరోయిన్లు ఎవరో చూద్దాం.
1.మాన్య :
సీతారామరాజు సినిమాతో మాన్య తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆమెలో టాలెంట్ ఉంది. చూడడానికి బాగుంటుంది. సన్నని పర్సనాలిటీ. అయితే పెళ్లి తర్వాత మాన్య న్యూయార్క్‌లో సెటిల్ అయ్యారు. ఆమె ఇప్పుడు నాలుగేళ్ల పాపకు తల్లి. పెళ్లి అయిపోయాక మాన్య వరల్డ్ వైడ్‌గా పేరున్న జేఆర్ మోర్గాన్ చేస్ అండ్ కో కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నారు.
2. మయూరి కాంగో :
నటి మయూరి కూడా మహేష్‌బాబు వంశీ సినిమాలో నటించింది. వంశీలో ఆమె సెకండ్ హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఐఐటీ ఖరగ్‌ఫూర్‌లో చదువుకున్న మయూరి సినిమాలపై ఇంట్రెస్ట్‌తోనే చదువు మధ్యలో వదిలేసి సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఆమె జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చదువుకుని ప్రస్తుతం గూగుల్ ఇండియాలో ఉన్నత స్థాయిలో ఉంది.
3. అపర్ణ :
విక్టరీ వెంకటేష్ నటించిన సుందరకాండ సినిమా ఎప్పటకీ గుర్తుండిపోతుంది. 1992లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ , మీనాతో పాటు అపర్ణ కూడా నటించింది. ఆ సినిమాలో లెక్చరర్ వెంకటేష్‌ను ఇష్టపడే స్టూడెంట్ పాత్రలో నటించి మెప్పించింది. ఆ ఒక్క సినిమాతో నటన ఆపేసి ఆ తర్వాత చదువుకున్న ఆమె 2002లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి కాలీఫోర్నియాలో ఉంటోన్న ఆమె సైకాలజీ డిగ్రీ చదివారు. యూఎస్‌లో ఓ ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇన్స్‌ట్యూషన్‌లో ఏడేళ్లుగా ఎంతో మందిని తీర్చిదిద్దుతున్నారు.
4. యామిని శ్వేత :
చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మొదటి సినిమాతో పాపులర్ అయ్యింది యామిని శ్వేత. జయం సినిమా తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే డిగ్రీ చదివి విదేశాల్లో మాస్టర్స్ చేసిన ఆమె ఓ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. ప్రస్తుతం పెళ్లి కావడంతో ఆమె తన కుటుంబంతో పాటు వ్యాపారాన్ని చూసుకుంటోంది.