నటసార్వభౌమ.. నందమూరి తారక రామారావు.. ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ఇది దానిని అమలు చేయ కుండా మాత్రం వదిలిపెట్టరు. అది ఎంత కఠినమైన నిర్ణయమైనా.. కూడా.. ఖచ్చితంగా అమలు చేయా ల్సిందే. సినీ రంగంలో ఒకానొక దశ దాటిన తర్వాత.. ఏ సినిమాల్లో నటించాలి..? ఏ సినిమాలకు దూరంగా ఉండాలి? అనే విషయంపై ఎన్టీఆర్ ఆచితూచి వ్యవహరించేవారు. అప్పుడు ఆయనకు బాగా స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆయన సినిమాల ప్రభావం ప్రజలపై గట్టిగా పడుతోందనుకుంటోన్న టైంలో మంచి కథా బలంతో పాటు ప్రజల్లో మార్పునకు కారణమయ్యే కథలపైనే ఆయన ఎక్కువుగా మక్కువ చూపేవారు.
ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సినిమాలను ఆయన వదులుకునేవారు. ఆ సినిమాల్లో నటించడం వల్ల.. తనకు ఇబ్బందనో.. లేక పేరు రాదనో.. ఆయన భావన అయి ఉంటుంది. ఇలానే.. భానుమతి నటించిన చిత్రాల్లో అన్నగారు చాలా తక్కువగా కనిపించేవారు. ఆమె స్ట్రిక్ట్‌నెస్ నచ్చకపోవడమో.. లేక.. మరే కారణమో తెలియదు కానీ.. అన్నగారు మాత్రం ఆమె పక్కన నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు.
ఈ క్రమంలోనే భానుమతి – నాగేశ్వరరావు కాంబినేషన్‌లోనే ఎక్కవగా సినిమాలు వచ్చాయి. అయితే.. మల్లీశ్వరి సినిమా సమయంలో ఎన్టీఆర్‌పై ఒత్తిడి వచ్చింది. ఈ సినిమాలో దిగ్గజ దర్శకుల నుంచి కూడా ఆయన ఒత్తిడి ఎదుర్కొన్నారట. ఈ సినిమాలో తొలుత అక్కినేని నాగేశ్వరరావును తీసుకునేందుకు ప్రయ త్నాలు సాగాయి. అయితే.. మల్లీశ్వరి సినిమాలో అన్నగారే బాగుంటారంటూ.. దర్శకుడు చెప్పడంతో.. నిర్మాతలు అన్నగారిని సంప్రదించారు.
అయితే.. తాను బిజీగా ఉన్నానని.. కుదరదని.. అన్నగారు తేల్చి చెప్పడంతో.. నిర్మాతలు వెనుదిరిగారు. కానీ, ఎన్టీఆర్ మనసెరిగిన మల్లీశ్వరి చిత్రం దర్శకుడు.. బీఎన్ రెడ్డి అన్నగారికి ఓ కీలక విషయం చెప్పా రు. వాహినీ స్టూడియో నిర్మించిన ఈ చిత్రం.. బహుబాషల్లోకి డబ్ కానుందని.. ఇది మంచి మేలు మలుపు అవుతుందని.. అన్నగారికి చెప్పడంతోపాటు.. నాగరాజు పాత్ర మాస్‌ను మరింతగా ఆకట్టుకుంటుందని.. క్లాస్ ఇవ్వడంతో వద్దనుకున్న చిత్రాన్ని కూడా అన్నగారు ఒప్పుకొని పూర్తి చేశారు.
చివరకు ఈ సినిమా సంచలన విజయం సాధించింది. నాటి రోజుల్లోనే రాజరికపు ఆడంబరాలను, ఆచారాలను సినిమాలో షూట్ చేసినా కూడా ఈ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనాలో ఏకంగా 100 రోజులకు పైగా ఆడింది. అసలు ఇదో సంచలన రికార్డ్. ఈ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌తో సహా అన్నీ తానే వ్యవహరించాడు బీఎన్. రెడ్డి. మల్లీశ్వరి ఇప్పటకి తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్ సినిమాగా నిలిచిపోతుంది.