మ్యాచో హీరో గోపీచంద్ కెరీర్ పడుతూ లేస్తూ ముందుకు వెళుతోంది. కెరీర్ స్టార్టింగ్‌లో గోపీచంద్‌కు వచ్చిన హిట్లు ఇప్పుడు పడడం లేదు. సరైన ఒక్క మాస్ హిట్ పడితే గోపీచంద్ మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. గీతా ఆర్ట్స్, బన్నీ వాస్ కలిసి తాజాగా గోపీ హీరోగా తీసిన పక్కా కమర్షియల్ సినిమా కూడా అంచనాలు అందుకోలేకపోయింది. బన్నీ వాస్ బ్యాకప్ ఉండి.. మారుతి లాంటి డైరెక్టర్ తీసి.. ప్రామీసింగ్ అంచనాలు ఉండి కూడా సినిమా ప్లాప్ అయ్యింది.
అయితే గోపీ కెరీర్ స్టార్టింగ్‌లో యజ్ఞం, రణం సినిమాలు వచ్చాయి. ఇవి మంచి ఫికప్ చేశాయి. రణం సినిమాకు కొరియోగ్రాఫర్‌గా ఉన్న అమ్మ రాజశేఖర్ దర్శకుడు. అయితే రణం సినిమా కథను అమ్మ రాజశేఖర్ ముందుగా కొందరు హీరోలకు చెప్పారట. ఈ క్రమంలోనే యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఎన్టీఆర్‌కు కూడా కథ వినిపించాడట.
అయితే ఎన్టీఆర్‌కు ఈ కథ సూట్ కాదని రాజశేఖర్‌కు ముందే తెలుసు. ఎందుకంటే ఈ సినిమాలో హీరో విలన్‌కు ముందు కింద కూర్చొని ఉంటాడు… అది ఎన్టీఆర్ స్థాయిని విలన్ల ముందు అలా తగ్గించి చూపిస్తే బాగోదు. కథ విన్నాక ఎన్టీఆర్ ఇది గోపీచంద్‌కు బాగుంటుందని సూచనలు చేశాడట. అయితే అప్పటకీ అమ్మ రాజశేఖర్‌కు గోపీచంద్ ఎవరో తెలియదట. అప్పుడు అసిస్టెంట్ కెమేరామెన్‌గా ఉన్న సంతోష్ శ్రీనివాస్ ( తర్వాత దర్శకుడు అయ్యి కందిరీగ, రభస సినిమాలు చేశాడు) ద్వారా గోపీచంద్‌ను కలిశాడట.
గోపీచంద్ అమ్మ రాజశేఖర్‌కు నమస్కారం పెట్టి మాస్టర్ కథ చెప్పమని విన్నాడట. కథ నచ్చడంతో వెంటనే రణం సినిమా చేశారు.. సూపర్ హిట్ అయ్యింది. కామ్న జెఠ్మలానీ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు ముందు ప్లాప్ టాక్ వచ్చింది. తర్వాత మాస్‌కు పిచ్చెక్కిపోయింది. తర్వాత ఇండస్ట్రీ వాళ్లు అందరూ అమ్మ రాజశేఖర్‌ను మెచ్చుకున్నారు.
అలా ఎన్టీఆర్ సజెషన్ మేరకు గోపీచంద్ ఖాతాలో రణం హిట్ పడింది. ఇక తనకు గోపీచంద్‌ను పరిచయం చేశాడన్న కృతజ్ఞతతోనే అమ్మ రాజశేఖర్ తర్వాత తాను రవితేజతో తీసిన ఖతర్నాక్ సినిమాకు సంతోష్ శ్రీనివాస్‌ను కెమేరామెన్‌గా పెట్టుకున్నాడు. ఖతర్నాక్ రాంగ్ టైమింగ్‌లో రిలీజ్ కావడం వల్లే ప్లాప్ అయ్యిందని రాజశేఖర్ తెలిపాడు.