యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నిజంగానే గుడ్డిగా నమ్మి ఎరక్క ఇరుక్కుపోయినట్టే ఉంది. త్రిబుల్ ఆర్ సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ల టైం వేస్ట్ చేశాడు. కరోనా కారణం కావచ్చు.. మరొకటి కావచ్చు… ఏదేమైనా 2018లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ తర్వాత నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తీసుకుంటే కాని త్రిబుల్ ఆర్ సినిమా రాలేదు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా 2019 – 2020 – 2021 ఇలా మూడు క్యాలెండర్ ఇయర్లు వరుసగా సినిమాలు లేకుండా గడచిపోయాయి.
త్రిబుల్ ఆర్ సినిమాలో తనతో పాటు నటించిన రామ్‌చరణ్ ఈ మధ్యలోనే ఆచార్యతో వెంటనే ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇక ఇప్పుడు శంకర్ సినిమా షూటింగ్ కూడా స్పీడ్‌గా జరుగుతోంది. ఇది కూడా సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేస్తోంది. అంటే ఎన్టీఆర్ కొత్త సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే చెర్రీ రెండు సినిమాలు లైన్లో పెట్టేసుకున్నాడు. బన్నీ ఓ వైపు అల వైకుంఠపురంలో, పుష్ప సినిమాలతో వచ్చి పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టాడు. అటు మహేష్ కూడా సరిలేరు నీకెవ్వరు, సర్కారువారి పాట సినిమాలతో హిట్లు కొట్టారు.
ఇలా యంగ్ హీరోలు కరోనా టైంలో వచ్చిన గ్యాప్‌ను మంచి కథలు విని.. మంచి సినిమాలు లాక్ చేసుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఇంత గ్యాప్ వచ్చినా కూడా సరైన కథలు ఎంచుకోలేకపోయాడా ? అనిపిస్తుంది. త్రిబుల్ ఆర్ వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఇప్పటకీ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. కొరటాల హిస్టరీ చూసేసి గుడ్డిగా నమ్మేసి ఓకే చెప్పేశాడు. అయితే ఆచార్య సినిమా రిజల్ట్ చూశాక కొరటాల ఎన్టీఆర్‌కు ఎలాంటి కథ సెట్ చేయాలో సతమతమవుతున్నాడు. అయితే ఇప్పటకీ ఫైనల్ స్క్రిఫ్ట్‌ను లాక్ చేయలేదని తెలుస్తోంది.
అందుకే ఇప్పటకీ ఈ సినిమా అదిగో ఇదిగో అని చెపుతున్నా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఎన్టీఆర్ టైం కూడా అటు వేస్ట్ అవుతోంది. అసలు కొరటాల ఈ సినిమాను ఎప్పటకీ ఫినిష్ చేస్తాడో అర్థంకాక ఫ్యాన్స్ కూడా ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ప్రశాంత్‌నీల్ ప్రభాస్‌తో సలార్ సినిమా పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమా కోసం కాచుకుని ఉన్నాడు. అయితే ముందుగా కొరటాల సినిమా పూర్తవ్వాలి.
ఓ వైపు ఆచార్యతో కొరటాలకు దిమ్మతిరిగే దెబ్బ తలగడంతో కథలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో తెలియక కొరటాల ఇబ్బందులు పడుతుంటే.. అటు హీరోయిన్ కూడా ఇప్పటకీ సెట్ కాలేదు. ఎన్టీఆర్‌కు ఇంకా హీరోయిన్‌ను సెట్ చేయకపోవడం ఏంటని కూడా ఆయన అభిమానులు కొరటాలను సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. కొరటాల ఇంకా ఫైనల్ స్క్రిఫ్టే లాక్ చేయకపోవడంతో ఇంకా హీరోయిన్ వరకు వెళ్లేనే లేదు.
ఆచార్యలో అస్సలు ఎలివేషన్లే లేవు. ఎన్టీఆర్ కోసం ముందు రాసుకున్న కథలో కూడా ఎలివేషన్లు లేకపోవడంతో ఎన్టీఆర్ చెప్పిన మార్పులు , చేర్పులు చేసే పనిలో కొరటాల బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే ఎన్టీఆర్ కొరటాలను బ్లైండ్‌గా నమ్మకుండా ఫుల్ స్క్రిఫ్ట్ విన్నాకే ఓకే చెప్పి ఉంటే ఇంత ఆలస్యం అయ్యేదే కాదు. అసలే త్రిబుల్ ఆర్ కోసం నాలుగేళ్ల టైం లాస్ అయ్యింది అంటే.. ఇప్పుడు కొరటాల కూడా ఎన్టీఆర్ టైం మరీ వేస్ట్ చేస్తోన్న పరిస్థితే ఉంది.