యస్..మీరు వింటున్నది నిజమే..డాక్యుమెంటరీగా నయన్-విఘ్నష్ల పెళ్లి వీడియోని డిజైన్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టేశాడట డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్. ఇక ఈ డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయగా, రౌడీ పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. మనకు తెలిసిందే, స్టార్ హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని పెళ్లి ప్రేమించి చేసుకునింది.
గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట..జూన్ 9 న మహాబలిపురంలోని..ఓ రిసార్డ్ లో గ్రాండ్ గా పెళి చేసుకుని ఒక్కటైయ్యింది. అయితే, వీళ్ల పెళ్లి వీడియో కి సంబంధించిన రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ ధర కు కొనుకుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇంకా టైటిల్ పెట్టని ఈ డాక్యుమెంటరీలో నయన్-విఘ్నేష్‌ల ప్రేమ ప్రయాణం, అక్కడి నుండి వారి పెళ్లి వరకు చోటు చేసుకున్న పరిణామాలను ప్రేక్షకులకు చూపించబోతున్నట్లుగా దర్శకుడు గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చాడు.
దీంతో నయన్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. తమ ఫేవరేట్ హీరోయిన్ పెళ్లిని చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా వీరి పెళ్లి వీడియో కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు 25కోట్లు చెల్లించిందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
అయితే నెట్‌ఫ్లిక్స్ సంస్థ తో కుదురుచుకున్న ఒప్పందాని ఈ జంట బ్రేక్ చేసిందని..దీంతో నయన్ 25 కోట్లు నష్ట పోయిందని..వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ ఫేక్ అంటూ నెట్‌ఫ్లిక్స్ సంస్థ స్పందించి అవన్ని రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చింది. టూ మచ్ చేస్తున్న నయన్ దంపతులు..ప్రపంచంలో వీళ్ళు మాత్రమే పెళ్లి చేసుకున్నారా..? అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.