సీనియర్ నటుడు నరేష్ – పవిత్రా లోకేష్ – రమ్య రఘుపతి – సుచేంద్ర ప్రసాద్ ఈ పేర్లు తెలుగు మీడియాలో, తెలుగు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. పవిత్రా లోకేష్ – నరేష్ కలిసి ఉండడంతో పాటు వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారన్న వార్తల నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకు వచ్చి పవిత్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె వచ్చాకే తమ బంధం విచ్ఛిన్నమవ్వడంతో పాటు తాము విడాకులు తీసుకునే వరకు వచ్చిందని ఆరోపించారు. నరేష్ తనను గన్‌తో బెదిరించారని కూడా ఆమె ఆరోపిస్తుంటే నరేష్ మాత్రం ఆమె క్యారెక్టరే అస్సలు మంచిది కాదని చెప్పారు.
అటు పవిత్ర సైతం రమ్య తనను బ్యాడ్‌గా చేసేందుకే బెంగళూరు వెళ్లి మీడియా ముందు హడావిడి చేస్తున్నారని వాపోయారు. ఇక రమ్య తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రను నరేష్ ఎలా ? పెళ్లి చేసుకుంటారని కూడా ప్రశ్నిస్తోంది. ఈ గోల నేపథ్యంలో నరేష్ బెంగళూరు ప్రెస్మీట్లో సంచలన విషయాలు బయట పెట్టారు. ఓ కన్నడ సినిమాలో నటిస్తోన్న నరేష్ మీడియాతో మాట్లాడుతూ తన మూడో భార్య రమ్య రఘుపతి గురించి చాలా సంచలన విషయాలు బ్లాస్ట్ చేశారు.
రమ్య ఏ రోజు కూడా తన భార్యలా ప్రవర్తించలేదని.. ఓ బాబు పుట్టాక ఆమె మనస్తత్వం తనకు అర్థమైందని.. తనను ఎన్నో విధాలుగా ఆమె హెరాస్ చేసిందని ఆరోపించాడు. ఆమె దగ్గర పనిచేసే ఓ ముస్లిం అబ్బాయి.. హ్యాండ్సమ్గా ఉండే డ్రైవర్‌తోనే ఆమె ఎఫైర్ పెట్టుకుందని సంచలన ఆరోపణలు చేశాడు. వారిద్దరు సంబంధం కొనసాగిస్తుండగా తాను రెడ్ హ్యాండెడ్గానే పట్టుకున్నానని చెప్పారు.
ఇక ఓ సారి ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేసినప్పడు ఓ మేల్ క్యాబ్ డ్రైవర్‌ను తీసుకువచ్చిందని.. అతడితో కూడా ఎఫైర్ పెట్టుకుందని నరేష్ ఆరోపించారు. అంతే కాకుడా నీ పద్ధతి బాగోలేదని అన్నందుకు చెత్త వివరణలు ఇచ్చిందని చెప్పారు. ఆమె అసలు మనస్తత్వం తెలియడంతో పాటు పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించే తాను ఆమెను దూరం పెట్టానన్నారు.
రమ్య తనను ఎన్నో రకాలుగా హెరాస్ చేసిందన్న నరేష్.. ఇక త్వరలోనే ఆమె నుంచి విడాకులు కూడా తీసుకోబోతున్నట్టు చెప్పారు. ఇక పవిత్రతో తన బంధం గురించి మాట్లాడుతూ.. మా ఇద్దరి బంధానికి కృష్ణ గారి ఆమోదం కూడా ఉందని.. ప్రస్తుతం తాము కృష్ణ గారి ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నామని.. మా ఇద్దరి పెళ్లి గురించి చర్చలు కూడా నడుస్తున్నాయని చెప్పాడు.