Moviesఆ హీరోయిన్‌తో నా కెమిస్ట్రీ సూప‌ర్ అన్న చిరంజీవి... ఈ ప్రేమ...

ఆ హీరోయిన్‌తో నా కెమిస్ట్రీ సూప‌ర్ అన్న చిరంజీవి… ఈ ప్రేమ వెన‌క చాలా క‌థ ఉందా…!

మెగాస్టార్ చిరంజీవి 40 సంవ‌త్స‌రాల కెరీర్‌లో 152 సినిమాలు చేశారు. ప‌దేళ్ల గ్యాప్ వ‌చ్చింది.. ఆయ‌న రీ ఎంట్రీ ఇచ్చాక‌ చెప్పిన‌ట్టు జ‌స్ట్ టైం గ్యాప్ అంతే.. టైమింగ్‌లో గ్యాప్ లేదు. చిరు కుర్ర హీరోల‌ను మించి మ‌రీ పోటీప‌డుతూ వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. చిరు లైన్లో ఉన్న సినిమాలే మూడు ఉన్నాయి. ఇన్నేళ్ల కెరీర్లో చిరు ఎంతోమంది హీరోయిన్ల‌తో న‌టించాడు. అల‌నాటి మేటి న‌టి మేన‌క‌తో న‌టించిన చిరు ఇప్పుడు ఆమె కుమార్తె కీర్తి సురేష్‌తోనూ భోళాశంక‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు.

ఇక త‌న కొడుకు రొమాన్స్ చేసిన కాజ‌ల్‌, త‌మ‌న్నాతో తాను రొమాన్స్‌కు సై అంటున్నాడు. ఇలా ఎంత‌మంది హీరోయిన్ల‌తో చేసినా చిరు మాత్రం త‌న‌కు కొంద‌రు హీరోయిన్ల‌తో వెరీ వెరీ స్పెష‌ల్ అంటున్నాడు. రాధికతో న‌టించ‌డం అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చిరు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంట‌ర్వ్యూలో ఓపెన్ అయిపోయారు. రాధికతో త‌న కెమిస్ట్రీ చాలా బాగుంటుంది అని.. అందుకే ప్రేక్ష‌కులు కూడా త‌మ జంట ఎన్నో సినిమాల్లో న‌టించినా ఆద‌రించార‌ని చెప్పాడు.

రాధిక తాను సీన్లో న‌టించేముందు స్క్రిఫ్ట్ ఎలా ఉంద‌ని కాకుండా.. ఎలా చేస్తే సీన్ బాగా పండుతుందో చ‌ర్చించుకుని ఆ సీన్లో లీన‌మై న‌టించేవాళ్ల‌మ‌ని చిరు ఆమె గురించి గొప్ప‌గా చెప్పాడు. ఇక రాధిక – చిరు చాలా సినిమాల్లో న‌టించ‌డంతో ఇద్ద‌రు కెరీర్‌ల స్టార్టింగ్‌లో కొన్ని సంవ‌త్స‌రాల పాటు వాళ్లు ఒకే చోట క‌లిసి ఉండేవార‌ట‌. సురేఖ‌తో చిరు పెళ్లైన కొత్త‌లో కూడా అవుట్ డోర్ షూటింగ్‌ల‌కు వెళ్లిన‌ప్పుడు చిరు గోడ‌దూకేసి మ‌రీ రాధిక ఉన్న రూమ్‌లోకి వెళ్లి ఆమెతో గంట‌ల త‌ర‌బ‌డి క‌బుర్లు చెప్పి సురేఖ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవాడ‌ట‌.

అంత సాన్నిహిత్యం చిరు – రాధిక మ‌ధ్య ఉండేది. అందుకే రీసెంట్‌గా చిరు రాధిక రాడాన్ బ్యాన‌ర్లో ఓ సినిమా చేసేందుకు డేట్లు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రాధిక నిర్మాత‌గా చిరు హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇక రాధిక‌తో త‌న కెమిస్ట్రీ గురించి బాగా చెప్పిన చిరు సుహాసిని గురించి మాట్లాడుతూ సుహాసినితో న‌టిస్తే సినిమా హీరోయిన్‌తో న‌టించిన‌ట్టు ఉండ‌ద‌ని.. ఓ హోమ్లీ వాతావ‌ర‌ణంలో ఉన్న‌ట్టే ఉంటుంద‌ని చెప్పారు. సుహాసిని మామూలుగానే ఇంట్లో మ‌నిషిలా పాత్ర‌ల్లో ఒదిగిపోతుందే త‌ప్పా ఆమెను హీరోయిన్ అని ఎవ్వ‌రూ అనుకోరు.

ఇక న‌ట‌న‌లో సౌంద‌ర్య అంటే కూడా త‌న‌కు చాలా ఇష్టం అని చిరు చెప్పారు. ఇక రాధ‌తో న‌టించ‌డం అంటే త‌న‌కు కాస్త టెన్ష‌న్‌గా ఉంటుంద‌ని.. ముఖ్యంగా సీన్ల‌లో, డ్యాన్సుల్లో డైరెక్ట‌ర్ త‌న‌కు సీన్ వివ‌రించిన వెంట‌నే టేక్ తీసుకునేందుకు 5-10 నిమిషాలు తాను ఆలోచిస్తాన‌ని రాధ మాత్రం డైరెక్ట‌ర్ సీన్ చెప్పిన నిమిషంలోనే సెట్‌లోకి వ‌చ్చేసి షాట్‌కు రెడీ అయిపోతుంద‌ని.. ఆమె ఎన‌ర్జీ లెవ‌ల్సే వేరు అని చిరు అభిప్రాయ‌ప‌డ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news