గత నెల రోజులుగా టాలీవుడ్ మీడియా, సౌత్ మీడియాలో సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్రా లోకేష్. ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. ప్రస్తుతం కలిసే ఉంటున్నారన్న వార్తలు మీడియాను ఊపేశాయి. ఇప్పటికే నరేష్‌కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చే అంశం ఇంకా తేలలేదు. అయినా కూడా నరేష్ పవిత్రతో కలిసే ఉంటున్నాడు. ఇక పవిత్రాను పెళ్లి చేసుకుంటే అది నరేష్‌కు నాలుగో పెళ్లి అవుతుంది.
అటు పవిత్రా లోకేష్‌కు కూడా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా రెండో భర్త సీరియల్ నటుడు, దర్శకుడు సుచేంద్ర ప్రసాద్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సుచేంద్రకు కూడా పవిత్ర ఇంకా విడాకులు ఇవ్వలేదనే అంటున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్యలోకి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంటర్ అయ్యి నానా రచ్చ చేస్తోంది.
వీరిద్దరు మైసూర్‌లోని ఓ హోటల్లో ఉండగా ఆమె రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం.. నరేష్, పవిత్ర అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం జరిగాయి. ఈ క్రమంలోనే నరేష్ ఆస్తులకు సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. 62 ఏళ్ల వయస్సు ఉన్న నరేష్ లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. ఆయన విలాసవంతమైన జీవితానికే పవిత్రా లోకేష్ పడిపోయిందని అనేవారు కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని ఆమె భర్త సుచేంద్ర ప్రసాద్ చెపుతూ పవిత్రకు డబ్బు అంటే పిచ్చి అని.. ఆరు నెలల్లో నరేష్ దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని అతడిని కూడా వదిలేస్తుందని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
నరేష్‌కు తల్లి విజయనిర్మల నుంచి కోట్లాది రూపాయల స్థిర, చరాస్థులు వచ్చాయి. విజయనిర్మల ఆస్తులు ఈ నాటివి కావు. ఆమె 1960 నుంచే నటిగా ఉన్నారు. ఆ తర్వాత దర్శకురాలిగా మారి ఎన్నో సినిమాలు తీశారు. ఓ మహిళా దర్శకురాలిగా ఎక్కువ సినిమాలను డైరెక్ట్ చేసి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కారు. వాస్తవంగా చెప్పాలంటే కృష్ణ కెరీర్ స్టార్టింగ్‌లో ఆర్థికంగా సెటిల్ కాలేదు. తనతో సినిమా చేసిన నిర్మాత ఎవరైనా నష్టపోతే వెంటనే వాళ్లకు ప్రీగా కాల్షీట్లు ఇచ్చేసేశారు. అందుకే ఆయన అంతగా సంపాదించుకోలేదు.
మహేష్‌బాబు, రమేష్‌బాబుకు కూడా ఆయన మరీ భారీ స్థాయిలో ఆస్తులు అయితే ఇచ్చింది లేదు. సొంత సినిమాలు ప్లాప్ అవ్వడం కూడా కృష్ట ఆర్థికంగా నష్టపోవడానికి మరో కారణం. ఇక ఆయన సేవాగుణం వల్ల కూడా అంత ఆస్తులు వెనకేసుకోలేదు. విజయనిర్మల మాత్రం నటిగాను, దర్శకురాలిగాను, నిర్మాతగాను సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె ఆస్తులు అన్నీ కూడా తన ఏకైక వారసుడు నరేష్‌కే దక్కాయి.
ఆమె నరేష్‌కు ఇచ్చని స్థిర, చరాస్తుల విలువ మొత్తం చూస్తే రు.1000 కోట్లకు పైనే ఉంటుందట. ఒక్క హైదరాబాద్‌లోనే చాలా బిల్డింగులు నరేష్‌కు ఉన్నాయి. అటు చెన్నైతో పాటు బెంగళూరు నగరంతో పాటు తమిళనాడులో చాలా పొలాలు కూడా ఉన్నాయట. ఒక్క హైదరాబాద్ సరౌండింగ్స్‌లోనే 5 ఫామ్‌హౌస్‌లో ఉన్నాయట. గచ్చిబౌలిలో ఐదెకరాల విస్తీర్ణంలో భారీఫామ్ హౌస్ ఉందట. అలాగే మెయినాబాద్, శంకర్‌పల్లిలో కూడా సువిశాల స్థలంలో ఫామ్‌హౌస్‌లో ఉన్నాయి.
చెన్నైలో కూడా నరేష్ సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ఇక నరేష్ ఈ వయస్సులో కూడా నటుడిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒక్కో సినిమాకు రు. 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుల పరంగా చూస్తే టాలీవుడ్‌లో సొంత క్యారెవ్యాన్ కలిగిన నటుడు నరేష్ అంటేనే ఆయన ఎంత రీచ్చో తెలుస్తోంది. తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చినా తన కుమారులకు మాత్రం ఆయన అన్యాయం చేయలేదని.. తన ఆస్తిని వాళ్లకు కూడా వాటా ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాడని సమాచారం.