తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే టైటిల్‌తో ఇద్దరు హీరోలు సినిమాలు చేయడం ఎప్పటి నుంచో ఉంది. దివంగత ఎన్టీఆర్ నటించిన సినిమాల టైటిల్స్‌నే ఆయన తనయుడు బాలకృష్ణ పదే పదే రిపీట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఈ తండ్రి కొడుకులు ఒకే టైటిల్‌తో సినిమాలు చేస్తే ఆ రెండు కూడా హిట్ అయ్యాయి. బహుశా ప్రపంచ సినిమా చరిత్రలో ఈ రికార్డు ఎవ్వరికి ఉండదు.
ఇక ఇప్పుడు డబ్బింగ్ సినిమాలకు అయితే పాత తెలుగు సినిమాల టైటిల్స్‌నే వాడేస్తున్నారు. ఒక్క అక్షరం మార్పుతో ఒకే టైటిల్‌తో వస్తోన్న సినిమాలకు కొదవే లేదు. మన స్టార్ హీరోలు సైతం ఒకే టైటిల్‌ను రెండు సార్లు పెట్టుకుని సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే సూపర్‌స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్ ఒకే టైటిల్‌తో సినిమాలు చేశారు.
టాలీవుడ్‌లో 1986లో దాదాపుగా 118 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ యేడాదే తొలి తెలుగు 70 ఎంఎం సినిమా అదే యేడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అదే టైంలో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణ – శ్రీదేవి జంటగా నటించిన ఖైదీ రుద్రయ్య వచ్చి అది కూడా సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే కృష్ణ – శ్రీదేవి కాంబినేషన్లోనే గ్రామీణ వాతావరణం నేపథ్యంలో జయం మనదే సినిమా వచ్చి అది కూడా హిట్ కొట్టింది.
పరుచూరి బ్రదర్స్ రచన, కె. బాపయ్య దర్శకత్వం కలిసి ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలబెట్టాయి. అయితే సింహాసనం, ఖైదీ రుద్రయ్య సినిమాల తర్వాత భారీ అంచనాలతో రావడం ఈ సినిమాకు మైనస్ అయ్యింది. ఇక సూర్యవంశం, కలిసుందాం రా లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత ఫామ్‌లో ఉన్న వెంకటేష్ తన సొంత బ్యానర్‌లోనే జయం మనదేరా సినిమా తీశాడు.
సౌందర్య హీరోయిన్‌గా ఎన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2000లో రిలీజ్ అయ్యింది. భానుప్రియ కూడా సీనియర్ వెంకటేష్‌కు జోడీగా నటించింది. వందేమాతరం శ్రీనివాస్ స్వరాలు మ్యూజికల్ హిట్. ఆ రోజుల్లోనే ఈ సినిమా 36 కేంద్రాల్లో 100 రోజులు ఆడి హిట్ అయ్యింది.