ఎందుకోగాని బాలయ్య ఇప్పుడు మామూలు స్పీడ్‌లో లేడు. పెద్ద బ్యానర్లు, అగ్ర నిర్మాతలు అడ్వాన్స్ పట్టుకొని బాలయ్య ఒక్క ఛాన్స్ ఇస్తాడా అని క్యూలో ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు బాలయ్యతో సినిమా చేసేందుకే అసక్తి చూపని పెద్ద దర్శకులు సైతం ఇప్పుడు బాలయ్యతో ఒక సినిమా చేయాలని పంతం వేసుకుంటున్నారు. బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్, ఇప్పుడు ఈ లిస్ట్ లోకే మరో టాప్ డైరెక్టర్ కొరటాలశివ చేరాడు.
కొరటాల శివ ఇప్పటికే నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ సినిమాను కూడా కొరటాల తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా చూస్తే కొరటాల శివ ఆచార్య ముందు వరకు తిరుగులేని డైరెక్టర్‌గా ఉన్నారు. ఆచార్య ఆయన ఇమేజ్ను అమాంతం డ్యామేజ్ చేసింది. ఆచార్య ప్లాప్ అంతా కొరటాల ఖాతాలో వేయటం కూడా సరికాదు. చిరంజీవి స్వయంగా కొన్ని సుచనలు చేయటంతో పాటు, కరోనా కారణంగా సినిమా ఆల్యసం కావటం, కథలో మర్పులు చేయటం కూడా ఆచార్య పరాజయానికి ప్రధాన కారణాలు.
ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమా తెరకెక్కిస్తున్న కొరటాల ఆ తర్వాత నటసింహం బాలకృష్ణతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. కొరటాల తర్వాత లైనప్‌లో బన్నీతో పాటు బాలయ్య కూడా ఉన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో బాలయ్య కోసం కొరటాల పవర్ ఫుల్ కథను రెడీ చేశారట. ఈ కథను బాలయ్య మాత్రమే చేయగలడు అని… సమకాలిన రాజకీయ అంశాలతో కూడిన ఈ కథలో బాలయ్య చక్కగా సెట్ అవుతారు అని కొరటాల భావిస్తున్నారట. బాలకృష్ణతో సినిమాలు చేసేందుకు చాలా మంది స్టార్ డైరెక్టర్లు ఉత్సాహంతో ఉన్నారు.
ఈ లిస్ట్‌లోనే కొరటాల కూడా గత రెండు, మూడు సంవత్సరాలుగా తన ప్రయత్నలు తాను చేస్తున్నాడు. ఇక లాక్ డౌన్ సమయంలోనే కొరటాల బాలయ్య కోసం రెడీ చేసిన కథను బాలయ్యకు ఇప్పటికే వినిపించారని కూడా తెలుస్తుంది. బాలయ్యకు కథ నచ్చడంతో ఒకే చేశారని.. ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ పరిశిలిస్తున్నారు అని కూడా ఇండస్ట్రీలో గుసగుసలు ఉన్నాయి. అన్నీ కుదిరితే ఎన్టీఆర్‌తో కొరటాల తెరకెక్కిస్తున్న సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుతంది. కొరటాల – బాలయ్య కాంబినేషన్లో సినిమా అంటే రచ్చ మాములుగా ఉండదు అనే చెప్పాలి. బాలయ్య ఫ్యాన్స్‌కు కూడా అంతకు మించిన ఆనందం ఉండదు.