అందం, అభినయంతో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న జయప్రద గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం విషయంలో అప్పట్లో జయప్రద శ్రీదేవితో పోటీ పడేది. అలా ఎన్టీఆర్ ఎక్కువగా శ్రీదేవి, జయప్రదతోనే సినిమాలు తెరకెక్కించేవారు. జయప్రద తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత ఎన్నో ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు , తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి చిత్రాలతో పాటు అనేక హిందీ చిత్రాలలో కూడా నటించిన ఈమె సినీ కెరియర్ పీక్స్ లో ఉండగానే సినీ పరిశ్రమకు దూరమైంది.
1994లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈమె 2004 నుండి 2014 వరకు సమాజ్‌వాద్ పార్టీ తరపున యూపీలోని రాంపూర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఆమె అజంఘడ్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. సినిమాల విషయానికి వస్తే అంతులేని కథ , సీతా కళ్యాణం, యమగోల, అడవి రాముడు, సిరిసిరిమువ్వ ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు.
అటు సినీ ఇండస్ట్రీలో ఇటు రాజకీయ రంగంలో అలుపెరుగని బాటసారిలా దూసుకుపోయారనే చెప్పాలి.
అయితే జయప్రద తన వైవాహిక జీవితం… అలాగే వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదర్కోవడంతో పాటు అస్తవ్యస్తం చేసుకుంది. తన వ్యక్తిగత విషయానికి వస్తే.. హవాజ్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నప్పుడు రాజేష్ ఖన్నాతో ఈమె మొదటిసారి నటించినది. ఈ మొదటి సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అనే వార్త బాలీవుడ్లో బాగా చక్కర్లు కొట్టింది. అంతే కాదు సహజీవనం చేస్తున్నారు… త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున గాసిప్‌లు వినిపించాయి.
అలా రెండు సంవత్సరాలు పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట అనివార్య కారణాలవల్ల విడిపోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత మరో ఇద్దరితో కూడా ఈమె ఎఫైర్ నడిపిందని వార్తలు బాగా వైరల్ అయ్యాయి.
ఓ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ( తెలుగులో కూడా ఎన్నో హిట్లు ఇచ్చాడు) కూడా జయప్రద మాయలో పడ్డాడని అంటారు. అయితే జయప్రద చివరికి 1986లో ఫిబ్రవరి 22న ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకుంది.
అయితే అతడికి ముందుగానే చంద్ర అనే ఆమెతో వివాహం జరిగి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. నహతా తన భార్యకు విడాకులు ఇవ్వకుండా జయప్రదను వివాహం చేసుకొనీ.. ఈమెతో జీవించడానికి సిద్ధమయ్యాడు. అయితే జయప్రదకి మాత్రం రాజేష్ ఖన్నా మీద ప్రేమ తగ్గకపోవడం, ఇక తన భర్త శ్రీకాంత్ నహతా చేసిన మోసం తట్టుకోలేక అతడికి విడాకులు ఇచ్చిందంటారు. అయితే భర్తకు దూరమయ్యాక ఆమె రాజకీయంగా వెలుగడానికి ఎస్పీ సీనియర్ నేత అమర్‌సింగ్‌తో ఉన్న సాన్నిహిత్యమే అంటారు. ఆయన అండదండలతోనే ఆమె యూపీ రాజకీయాల్లో రాణించి రెండుసార్లు ఎంపీ అయ్యారు.